Exercise : వ్యాయామం తర్వాత ఎలాంటి ఆహార పదార్థాలు తినాలో మీకు తెలుసా?

వ్యాయామం చేయడం మంచిదే కానీ చాలామందికి వ్యాయామం (Exercise) చేసిన తర్వాత ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అని తెలియదు.

Exercise : ఈ రోజుల్లో చాలామంది అధిక బరువును తగ్గించుకోవడానికి హెల్తీగా ఉండడం కోసం ఎన్నో రకాల చిట్కాలను ఉపయోగించడంతో పాటు తరచుగా వ్యాయామాలు చేస్తూ ఉంటారు. అయితే వ్యాయామం (Exercise) చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వ్యాయామం చేయడం మంచిదే కానీ చాలామందికి వ్యాయామం (Exercise) చేసిన తర్వాత ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అని తెలియదు. మరి వ్యాయామం తర్వాత ఎటువంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

వ్యాయమం చేసిన తర్వాత సీజన్లో లభించే ఫ్రూట్స్ తప్పకుండా తినాలి. వాటి వల్ల వాటర్ కంటెంట్‌తో పాటు ఫైబర్ అధిక మొత్తంలో లభిస్తుంది. అలాగే అరటి, జామ, బత్తాయి వంటివి వర్కౌట్స్ తరువాత తినడం శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. అదేవిధంగా జీర్ణక్రియ కూడా బలోపేతం అవుతుంది. పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఇతర పోషకాలు బరువు తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. గ్రీక్ యోగర్ట్‌ అనేది ఒక రకమైన పెరుగు. ఇందులో ప్రొటీన్స్ అధికంగా, ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. దీనికి ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్, నేచురల్ షుగర్ అందాలంటే బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్ప్‌బెర్రీస్ వంటి తాజా బెర్రీలను ఆహారంలో చేర్చుకోవవాలి. వీటి కలయికతో గ్రీక్ యోగర్ట్ పోషకాలు బ్యాలెన్స్ అవుతాయి. బరువు తగ్గే ప్రయత్నంలో వర్కౌట్స్ చేసిన తరువాత గ్రీక్ యోగర్ట్ తీసుకుంటే శరీరానికి పోషకాలు సమృద్ధిగా అందుతాయి.

గుడ్లు, టోస్ట్‌లో ప్రొటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. విటమిన్స్, ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు తీవ్రమైన వర్కౌట్స్ తరువాత వీటిని తింటే ప్రయోజనం ఉంటుంది. ఇవి కండరాలను బలోపేతం చేస్తాయి. ఎక్కువసేపు పొట్టకు సంతృప్తి భావనను అందిస్తాయి. అతి ఆకలి వేయదు. జంక్ ఫుడ్స్ తినాలనే కోరిక తగ్గిపోతుంది. ఫలితంగా బరువు తగ్గవచ్చు. చిక్‌పీస్‌లో ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని వర్కౌట్స్ తరువాత తింటే బరువు తగ్గడానికి వీలు ఉంటుంది. ఎందుకంటే ఇవి సంతృప్తి భావనను మెరుగుపరుస్తాయి.

Also Read:  Thalapathy Vijay: పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్న దళపతి విజయ్, త్వరలో పార్టీ ప్రకటన!