Oily Hair : జుట్టు జిడ్డుగా ఉందా.. అయితే నూనెలో ఇది కలిపి రాయాల్సిందే?

మనలో చాలామందికి జుట్టు జిడ్డుగా ఉంటుంది. జుట్టుగా ఉండడంతో పాటు ముఖం కూడా జిడ్డుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలా జుట్టు జిడ్డుగా ఉన్నప్పుడు క

  • Written By:
  • Publish Date - January 28, 2024 / 05:30 PM IST

మనలో చాలామందికి జుట్టు జిడ్డుగా ఉంటుంది. జుట్టుగా ఉండడంతో పాటు ముఖం కూడా జిడ్డుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలా జుట్టు జిడ్డుగా ఉన్నప్పుడు కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే చాలు ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. అందుకోసం నూనెలో కొన్ని కలిపి రాయాల్సిందే అంటున్నారు నిపుణులు. తలస్నానం చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా షాంపూ చేసినా కూడా కొద్దిగా జిగటగా మారుతుంది. దీని వల్ల జుట్టు చిట్లుతుంది. అలాగే షాంపూ ఎక్కువగా ఉపయోగించకూడదు. తక్కువ షాంపూ ఉపయోగించాలి. ఆ తర్వాత జుట్టుని సహజంగానే ఆరనివ్వాలి. దీని వల్ల జిడ్డు సమస్య తగ్గుతుంది.

జిడ్డుగా ఉంటే చుండ్రు సమస్య వస్తుంది. చుండ్రు ఎక్కువగా జుట్టు జిడ్డుగా కనిపిస్తుంది. ఈ రెండింటికి దగ్గరి సంబంధం ఉంది. కాబట్టి, ముందుగా చుండ్రు సమస్యని దూరం చేసుకోండి. దీని వల్ల జిడ్డు సమస్య దూరమవుతుంది. చాలా మంది జుట్టు దువ్వడం వల్ల ఊడిపోతుందని అనుకుంటారు. అందుకే ఉదయం ఒకసారి మాత్రమే దువ్వుతారు. కానీ, రెగ్యులర్‌గా దువ్వడం వల్ల స్కాల్ప్‌ లోని ఫోలికల్స్ ఉత్తేజంగా మారి రక్తప్రసరణ పెరుగుతుంది. కాబట్టి, ఉదయం, సాయంత్రం రెండుసార్లు జుట్టుని దువ్వాలి. అలాగే గ్రీన్ టీలోని పాలిఫెనాల్స్ జుట్టు కుదుళ్ళని ఆరోగ్యంగా చేసి తలపై సెబమ్ ఉత్పత్తిని కంట్రోల్ చేస్తుంది. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో నీరు పోసి గ్రీన్ టీ ఆకులు వేసి మరిగించాలి.

ఇవి మరిగాక స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత ఈ నీటిని స్ప్రే బాటిల్‌లో పోసి కుదుళ్ళ నుంచి చివర్ల వరకూ స్ప్రే చేయాలి. అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో క్లీన్ చేయాలి. అదే విధంగా జిడ్డు సమస్యని దూరం చేయడంలో టీట్రీ ఆయిల్ బాగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రుతో పోరాడి జుట్టుని మెరిసేలా చేస్తాయి. గిన్నెలో 10 చుక్కల టీట్రీ ఆయిల్ తీసుకుని 30 మిల్లీ లీటర్ల కొబ్బరి నూనె వేసి వేడి చేయండి. తలని బాగా మసాజ్ చేయండి. తలస్నానానికి ఓ గంట ముందు మసాజ్ చేయండి. తర్వాత షాంపూతో జుట్టుని క్లీన్ చేసుకోవాలి..