Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? మీ కోసమే

పండుగల సమయంలో ఖర్చులు పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో చాలా మంది రుణం తీసుకోవలసి ఉంటుంది. వ్యక్తిగత లోన్ తీసుకోవడం ద్వారా అనేక పనులను సులభంగా పూర్తి చేసుకోవచ్చు.

Personal Loan: పండుగల సమయంలో ఖర్చులు పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో చాలా మంది రుణం తీసుకోవలసి ఉంటుంది. వ్యక్తిగత లోన్ తీసుకోవడం ద్వారా అనేక పనులను సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఏదైనా రుణం తీసుకునే ముందు తొందరపడకూడదు. ఇలా చేస్తే ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఏ విషయాలను గుర్తుంచుకోవాలి అన్నది చూద్దాం.

రుణం తీసుకునే ముందు క్రెడిట్ స్కోర్ తప్పనిసరిగా చూసుకోవాలి. క్రెడిట్ స్కోర్ ఆధారంగా మాత్రమే బ్యాంకు రుణం ఇస్తుంది. క్రెడిట్ స్కోర్ 550 కంటే తక్కువ ఉంటే రుణం పొందడంలో ఇబ్బంది పడవచ్చు. అదే సమయంలో 550 నుండి 750 మధ్య క్రెడిట్ స్కోర్‌పై అధిక వడ్డీని చెల్లించాల్సి రావచ్చు. కస్టమర్ క్రెడిట్ స్కోర్ 850 కంటే ఎక్కువ ఉంటే తక్కువ వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు .
ఎంప్లాయిస్ పర్సనల్ లోన్‌లో ఉపశమనం పొందుతారు. జీతభత్యాల ద్వారా రుణాలు సులభంగా తిరిగి చెల్లిస్తారని బ్యాంకర్లు నమ్మకం ఉంచుతారు. దీనికి కారణం వారికి ప్రతి నెలా స్థిర ఆదాయం లభిస్తుంది. మీరు ప్రముఖ కంపెనీలో పని చేస్తున్నట్లయితే తక్కువ వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.బ్యాంక్ తో మీ రిలేషన్‌షిప్ బాగుంటే తక్కువ వడ్డీ రేటుతో ప్రయోజనం పొందుతారు. ఇది కాకుండా వడ్డీలో రాయితీని కూడా పొందవచ్చు.

ఈ విషయాలను గుర్తుంచుకోండి?
బ్యాంక్ విధించే ప్రాసెసింగ్ ఛార్జీలు మరియు ఇతర ఛార్జీలను మీరు అర్థం చేసుకోవాలి .
అంతే కాకుండా బ్యాంక్ ఇచ్చే పర్సనల్ లోన్ షరతులను కూడా వివరంగా అర్థం చేసుకోవాలి.
ఒకటి లేదా రెండు బ్యాంకుల వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లను పరిశీలించుకోవాలి
రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించాలి. సకాలంలో కట్టకపోతే క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది.

Also Read: Hamas attack on Israel: ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయులు జాగ్రత్త..