Eggless Ravva Cake: ఎగ్​లెస్ రవ్వ కేక్.. ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకోండిలా?

  • Written By:
  • Updated On - February 17, 2024 / 08:54 PM IST

మాములుగా పిల్లలు బ్రేకరీ ఐటమ్స్ ని ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. అందులో ముఖ్యంగా కేక్ ఐటమ్స్ ని ఇష్టపడుతూ ఉంటారు.అయితే బ్రేకరి లో చేసే కేక్ ఐటమ్స్ ని ఇంట్లోనే చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ వాటిని ఎలా తయారీ చేయాలో తెలియక తెగ ఆలోచిస్తూ ఉంటారు. అయితే మీరు కూడా కేక్ ని ట్రై చేయాలనుకుంటున్నారా. అయితే ఇంట్లోనే సింపుల్ గా ఎగ్ లెస్ రవ్వ కేక్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు :

రవ్వ – 1 కప్పు
గోధుమ పిండి – అరకప్పు
పంచదార – ముప్పావు కప్పు
ఉప్పు – చిటికెడు
పెరుగు – 1 కప్పు
వెనీలా ఎసెన్స్ – అర టీస్పూన్
ఆలివ్ ఆయిల్ – ముప్పావు కప్పు
పాలు – అరకప్పు
బేకింగ్ పౌడర్ – 1 టీస్పూన్
బేకింగ్ సోడా – అర టీస్పూన్
పిస్తా – గార్నిష్ కోసం
నీరు – అరకప్పు
పంచదార – 2 టీస్పూన్స్
నిమ్మరసం – 2 టీస్పూన్స్

తయారీ విధానం

ముందుగా ఓవెన్​ను 180 డిగ్రీల సెల్సియస్​కు 10 నిమిషాలు ప్రీ హీట్ చేయండి. ఇప్పుడు ఓ గిన్నె తీసుకునిదానిలో గోధుమ పిండి, రవ్వను వేసి జల్లెడ పట్టాలి. దానిలో పంచదార పొడి కూడా వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు ఉప్పు, పెరుగు, వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలపాలి. ముద్దలుగా లేకుండా కలిపిన తర్వాత దానిలో ఆలివ్ నూనె వేయాలి. ఇది మిశ్రమాన్ని మరింత క్రీమీగా చేస్తుంది. ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెంగా పాలు పోయాలి. ఇది మందపాటి పిండి అయ్యేలా బాగా కలపాలి. అనంతరం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి కలపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కేక్ టిన్​ తీసుకుని దానికి నెయ్యి రాసి, దానిలో బటర్​ పేపర్ వేసినా కూడా నెయ్యి రాయడం మాత్రం మరచిపోకూడదు. ఇప్పుడు తయారు చేసుకున్న పిండి మిశ్రమాన్ని దీనిలో వేయాలి. ఎలాంటి గ్యాప్స్ లేకుండా కేక్​ టిన్​ను మెల్లగా నేలప్ టాప్ చేయాలి. ఈ టిన్​ను బేకింగ్​ కోసం ఓవెన్ల్ ఉంచండి. 180 డిగ్రీల సెల్సియస్ వద్ద 45 నిమిషాలు కేక్​ను బేక్ చేయాలి. ఇలా తయారు చేసుకున్న కేక్​ను ఓవెన్​ నుంచి తీసి గది ఉష్ణోగ్రతకు చల్లారనివ్వాలి. సర్వింగ్ ప్లేట్​లోకి తీసుకోవాలి. ఆపై షుగర్ సిరప్ కోసం గ్యాస్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దానిలో నీరు, చక్కెర వేయాలి. అది మరగడం ప్రారంభించే వరకు మీడియం మంట మీద వేడి చేయాలి. తర్వాత నిమ్మరసం వేసి బాగా కలిపి స్టౌవ్ ఆపేయాలి.