Site icon HashtagU Telugu

Egg White Face Pack : ఎగ్ వైట్ తో ఫేస్ ప్యాక్.. ఇలా వేసుకుంటే మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

egg white face packs for all skin types

egg white face packs for all skin types

Egg White Face Pack : అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. ఎవరికి వారే.. తమకి తాము అందంగా కనిపిస్తారు. ఎదుటివారికి కూడా అందంగా కనిపించాలని ఆరాటపడుతుంటారు. అందుకోసం రకరకాల ఫేస్ వాష్ లు, ఫేస్ ప్యాక్ లను వాడుతుంటారు. కెమికల్స్ తో కూడిన స్కిన్ కేర్ క్రీమ్స్ వాడుతుంటారు. కెమికల్ ప్రొడక్ట్స్ కాకుండా.. సహజమైన ఉత్పత్తులతో చర్మ సంరక్షణ తీసుకోవచ్చు. కోడిగుడ్డులోని తెల్లసొన కూడా చర్మాన్ని సంరక్షిస్తుంది. ముఖ అందాన్ని పెంచుతుంది.

గుడ్డులో తెల్లసొనతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం అనేది ఇప్పుడొచ్చింది కాదు. శతాబ్దాలుగా దీనిని పాటిస్తున్నారు. చర్మంపై ముడతలు, మొటిమలను నివారిస్తుంది. జిడ్డు, మురికి తొలగిపోయి చర్మం మెరుస్తూ.. కాంతివంతంగా కనిపిస్తుంది.

మొటిమలకు ఎగ్ వైట్ ఫేస్ ప్యాక్

గిన్నెలో తెల్లసొన తీసుకుని 1 టీ స్పూన్ నిమ్మరసం, అర టీస్పూన్ తేనె వేసి కలుపుకోవాలి. దీనిని ముఖానికి పట్టించి 10-15 నిమిషాలపాటు బాగా ఆరనివ్వాలి. తర్వాత వెట్ క్లాత్ తో తుడిచి.. గోరువెచ్చని నీటితో ముఖాన్ని ఆరనివ్వాలి. మాయిశ్చరైజర్ అప్లై చేసి అలాగే ఉంచాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి 2 సార్లు వాడితే చాలు. మొటిమలు త్వరగా తగ్గి.. స్కిన్ సాఫ్ట్ గా అవుతుంది.

డార్క్ స్కిన్ కు ఎగ్ వైట్ ఫేస్ ప్యాక్

అలాగే డార్క్ స్కిన్ ను తొలగించడంలోనూ తెల్లసొన ఉపయోగపడుతుంది. తెల్లసొనలో 1 టీ స్పూన్ ఆరెంజ్ జ్యూస్, అర టీ స్పూన్ పసుపుపొడిని కలపాలి. వాటిని ముఖానికి పట్టించి బాగా ఆరనివ్వాలి. గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. చర్మం ఆరిన తర్వాత మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి. వారానికొకసారి ఈ ఫేస్ ప్యాక్ వాడితే డార్క్ స్కిన్ తగ్గి.. ముఖం మెరుస్తుంది.

సెన్సిటివ్ స్కిన్ కోసం ఎగ్ వైట్ ఫేస్ ప్యాక్

సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు కూడా ఎగ్ వైట్ ఫేస్ ప్యాక్ ను వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ తేనె, 1 టీ స్పూన్ పెరుగు, 1 టీ స్పూన్ దోసకాయ రసం కలిపి బాక్ మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగి చర్మాన్ని ఆరనిచ్చాక.. మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.

ఆయిలీ స్కిన్ ఉన్నవారికోసం ఎగ్ వైట్ ఫేస్ ప్యాక్

మీ ముఖం జిడ్డుగా ఉన్నట్లయితే.. గుడ్డులో తెల్లసొనను ఒక గిన్నెలోకి తీసుకుని.. అందులో సగం చెక్క నిమ్మరసం వేసి కలుపుకోవాలి. దీనిని ముఖానికి పట్టించి పావుగంటసేపు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. వారానికి 2 సార్లు.. ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. మెరిసే ముఖం మీ సొంతం.

డ్రై స్కిన్ ఎగ్ వైట్ ఫేస్ ప్యాక్

చర్మం పొడిగా ఉంటే.. ఎగ్ వైట్ లో కొద్దిగా అవకాడో, 1 టీ స్పూన్ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఫేస్ కు అప్లై చేసి.. 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. వారానికి ఒకట్రెండుసార్లు వేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

 

 

Exit mobile version