Egg Ulli Karam: ఎంతో స్పైసీగా ఉండే ఉల్లికారం కోడిగుడ్డు వేపుడు.. సింపుల్ గా ట్రై చేయండిలా?

మామూలుగా మనం కోడిగుడ్డుతో ఎన్నో రకాల వంటకాలు తినే ఉంటాం. కోడి గుడ్డు ఫ్రై, కోడి గుడ్డు మసాలా కర్రీ, ఎగ్ రైస్, ఎగ్ బిర్యానీ, ఎగ్ దమ్ బిర్యాని

  • Written By:
  • Publish Date - December 11, 2023 / 07:10 PM IST

మామూలుగా మనం కోడిగుడ్డుతో ఎన్నో రకాల వంటకాలు తినే ఉంటాం. కోడి గుడ్డు ఫ్రై, కోడి గుడ్డు మసాలా కర్రీ, ఎగ్ రైస్, ఎగ్ బిర్యానీ, ఎగ్ దమ్ బిర్యాని, ఎగ్ న్యూడిల్స్ లాంటి ఎన్నో రకాల వంటకాలను తినే ఉంటాం. అయితే ఎప్పుడైనా స్పైసీగా ఉండే ఉల్లికారం కోడిగుడ్డు వేపుడు తిన్నారా. ఒకవేళ తినకపోతే ఆ రెసిపీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఉల్లికారం కోడిగుడ్డు వేపుడుకు కావాల్సిన ప‌దార్థాలు:

ముక్క‌లుగా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 3
వెల్లుల్లి రెబ్బ‌లు – 8
కారం -3 టీ స్పూన్స్
ఉప్పు – త‌గినంత‌
నూనె – 2 టేబుల్ స్పూన్స్
జీల‌క‌ర్ర – అర టీ స్పూన్
క‌రివేపాకు – ఒక రెమ్మ‌
ధ‌నియాల పొడి -ఒక టీ స్పూన్
ప‌సుపు – పావు టీ స్పూన్
గ‌రం మ‌సాలా -పావు టీ స్పూన్
ఉడికించిన కోడిగుడ్లు – 3
త‌రిగిన కొత్తిమీర -తగినంత

ఉల్లికారం కోడిగుడ్డు వేపుడు తయారీ విధానం:

ముందుగా మిక్సీ జార్ లో ఉల్లిపాయలు, వెల్లుల్లి, కారం, ఉప్పు వేసి మెత్తగా కాకుండా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బాణలిలో నూనె పోసి వేడి చేయాలి. తర్వాత జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ కారం వేసి వేయించాలి. నూనె పైకి తేలే వరకు వేయించాలి. తర్వాత ధనియాల పొడి, పసుపు, గరం మసాలా వేసి కలుపుకోవాలి. చిన్నమంట పై ఒక నిమిషం పాటు వేయించాలి. తర్వాత కోడి గుడ్లను ముక్కలుగా చేసి అందులో వేయాలి. వీటిని అంతా కలిసేలా కలుపుకొని మరో రెండు నిమిషాలు పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా చేస్తే ఎంతో రుచికరంగా ఉండే ఉల్లికారం కోడిగుడ్డు వేపుడు రెడీ.