EGG Salad: ఎగ్ సలాడ్ తో ఈజీగా బరువు తగ్గండిలా.. రెసిపీ ఎలాగో చూడండి..

ప్రొటీన్లు ఎక్కువగా ఉండే కోడిగుడ్లను తినడం ఆరోగ్యానికి మంచిదే. వాటిని అమితంగా తింటే మాత్రం బరువు పెరుగుతారు. బరువు తగ్గాలనుకునేవారు కోడిగుడ్లను..

  • Written By:
  • Publish Date - January 2, 2024 / 07:52 PM IST

EGG Salad: కోడిగుడ్లు తింటే బరువు పెరుగుతామా ? తగ్గుతామా ? చాలా మందికి ఈ అనుమానం ఉంది. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే కోడిగుడ్లను తినడం ఆరోగ్యానికి మంచిదే. వాటిని అమితంగా తింటే మాత్రం బరువు పెరుగుతారు. బరువు తగ్గాలనుకునేవారు కోడిగుడ్లను రాత్రిపూట తినడం అలవాటు చేసుకోవాలి. రాత్రివేళలో పండ్లు, పాలు తాగి ఉండేవారు.. అన్ని పోషకాలను అందించే ఎగ్ సలాడ్ ను ట్రై చేయండి. శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంతో పాటు బరువును అదుపులో ఉంచుతుంది. జస్ట్ 5 నిమిషాల్లో దీనిని రెడీ చేసుకోవచ్చు.

ఎగ్ సలాడ్ రెసిపీకి కావలసిన పదార్థాలు

కోడిగుడ్లు – 1

ఉల్లిపాయ – 1

వెల్లుల్లి రెబ్బలు – 2

క్యారెట్ తురుము – 2 స్పూన్లు

టమాటా – 1 చిన్నది

చాట్ మసాలా – 1/4 స్పూను

మిరియాలపొడి – 1/4 స్పూను

కొత్తిమీర తరుగు – 2 స్పూన్లు

ఉప్పు – రుచికి సరిపడా

ఎగ్ సలాడ్ తయారీ విధానం

ఉడికించిన కోడిగుడ్డును సన్నగా కట్ చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ గిన్నెలోనే తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర తరుగు, క్యారెట్ తురుము వేసుకోవాలి. టమాటోలో గింజల్ని తీసేసి సన్నగా తరిగి దానిని వేసుకోవాలి. పైన చాట్ మసాలా లేదా మిరియాలపొడి, రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లి తరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ సలాడ్ రెడీ. ఈ సలాడ్ తో కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. కొవ్వు పెరగదు. బరువు తగ్గుతారు.