Site icon HashtagU Telugu

Egg Ponganalu: కోడిగుడ్డుతో గుంత పొంగనాలు ఇలా చేస్తే చాలు.. ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే?

Mixcollage 14 Mar 2024 07 58 Pm 252

Mixcollage 14 Mar 2024 07 58 Pm 252

గుంత పొంగనాలు.. పిల్లలనుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడే రెసిపీ కూడా ఒకటి. ఈ రెసిపీని చాలా వరకు ఈవెనింగ్ టైం లో తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఎప్పుడు దోశ పిండితో చేసిన పొంగనాలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కాస్త వెరైటీగా కూడా ట్రై చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడైనా కోడి గుడ్డుతో తయారుచేసిన గుంత పుంగనాలు తిన్నారా. ఒకవేళ తినకపోతే ఆ రెసిపీని ఇంట్లో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు :

కోడి గుడ్లు – నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్టు – అర స్పూను
ధనియాల పొడి – అర స్పూను
గరం మసాలా – అర స్పూను
మిరియాల పొడి – చిటికెడు
ఉల్లిపాయ – ఒకటి
పచ్చిమిర్చి – రెండు
నిమ్మరసం – ఒక స్పూను
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – పావు స్పూను

తయారీ విధానం :

ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో నాలుగు గుడ్లు కొట్టి గిలక్కొట్టి అందులో ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. గరం మసాలా, ధనియాల పొడి, పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. అందులో కొత్తిమీర తరుగు, నిమ్మరసం, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. తర్వాత స్టవ్ మీద గుంతపొంగనాలు వేసుకునే కళాయి పెట్టి వేడి చేయాలి. కాస్త నూనెను గుంతల్లో పోయాలి. ఇలా అయితే పొంగనాల అతుక్కోకుండా వస్తాయి. ఆ గుంతల్లో కోడి గుడ్ల మిశ్రమాన్ని వేసి, చిన్న మంట మీద పెట్టి మూత పెట్టాలి. మూడు నిమిషాల తరువాత స్పూను రెండో వైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి. ఓ మూడు నిమిషాల కాలాక స్టవ్ కట్టయాలి.