Site icon HashtagU Telugu

Egg Mutton Biryani: ఎగ్ మటన్ బిర్యానిని ఇలా చేస్తే చాలు ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వడం ఖాయం?

Mixcollage 24 Jan 2024 06 47 Pm 4661

Mixcollage 24 Jan 2024 06 47 Pm 4661

మామూలుగా నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా చికెన్ మటన్ గుడ్డు వంటివి ఇష్టపడి తింటూ ఉంటారు. కనీసం వారానికి రెండు మూడు సార్లు అయినా నాన్ వెజ్ ని తినాలని అనుకుంటూ ఉంటారు. అందులో చికెన్ తో రకరకాల రెసిపీలు మటన్ తో రకరకాల రెసిపీలు ట్రై చేసే ఉంటారు. అయితే ఎప్పుడైనా ఎగ్ మటన్ బిర్యానీ తిన్నారా. వినడానికి కాస్త వెరైటీగా ఉన్న ఈ రెసిపీ ఇలా సింపుల్గా చేస్తే చాలు లొట్టలు వేసుకొని మరి తినేస్తారు.

ఎగ్ మటన్ బిర్యాని రెసిపికి కావలసిన పదార్థాలు

గుడ్లు – 8
బియ్యం – రెండు కప్పులు
ఉల్లిపాయలు – 4
కారం – ఒక స్పూన్
ఉప్పు – సరిపడా
పుదీనా ఆకులు – తగినన్ని
ఆయిల్ – 2 స్పూన్
నెయ్యి – మూడు స్పూన్లు
అల్లం,వెల్లుల్లిపేస్ట్ 3 స్పూన్లు
యాలకులు – నాలుగు
లవంగాలు – 5
షాజీరా – ఒక స్పూన్
బిర్యానిఆకు – రెండు
జీడిపప్పు – సరిపడగా
పచ్చిమిర్చి – 4

ఎగ్ మటన్ బిర్యాని తయారీ విధానం :

ఇందుకోసం ముందుగా గుడ్లు తీసుకుని పగలకొట్టి ఒక గిన్నెలో వెయ్యాలి. అందులో కొంచం కారం ఇంకా ఉప్పు వేసుకుని బాగా బ్లెండ్ చెయ్యాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని వేసేసి మూత పెట్టాలి. ఆ మిశ్రమం బాగాపొంగి మందంగా తయారవుతుంది. ఇలా తయారైన ఆమ్లెట్ ను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి కట్ చేసిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక కారం కొంచం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి కట్ చేసిన ముక్కల్ని కూడా వేసి ఒక 15 పాటు చిన్న మంట మీద ఉడకనివ్వాలి. అప్పుడు ఆ ఎగ్ ముక్కలన్నీ మటన్ ముక్కల అవుతాయి. తర్వాత వేరొక స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టి నెయ్యివేసి అందులో షాజీరా ,లవంగాలు ,యాలకులు,బిర్యాని ఆకూ,రౌండ్ గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు,పుదీనా,జీడిపప్పు ,వేసి 4 కప్పుల నీళ్ళు పోసి కొంచం మరిగాకా కడిగి పెట్టుకున్న బియ్యం వేసి మూతపెట్టాలి. రైస్ కొంచం ఉడికాక ముందు తయారుచేసి పెట్టుకున్న ఎగ్ మటన్ కర్రీ వేసి కలిపి ఇంకో 10 నిముషాలు ఉడకనివ్వాలి. స్టవ్ పై నుంచిదించి కొత్తిమిర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే టేస్టీ అండ్ వెరైటీ ఎగ్ మటన్ బిర్యాని రెడీ.