Egg Kurma: ఎంతో స్పైసీగా ఉండే ఎగ్ కుర్మా ఇంట్లోనే తయారు చేసుకోండిలా?

మామూలుగా మనం గుడ్డుతో ఎన్నో రకాల రెసిపీ లను తయారు చేసుకొని తింటూ ఉంటాం. ఎగ్ రైస్, ఎగ్ మసాలా కర్రీ, ఎగ్ ఫ్రై, ఎగ్ న్యూడిల్స్, ఎగ్ బిర్యానీ ల

Published By: HashtagU Telugu Desk
Mixcollage 25 Jan 2024 04 09 Pm 1660

Mixcollage 25 Jan 2024 04 09 Pm 1660

మామూలుగా మనం గుడ్డుతో ఎన్నో రకాల రెసిపీ లను తయారు చేసుకొని తింటూ ఉంటాం. ఎగ్ రైస్, ఎగ్ మసాలా కర్రీ, ఎగ్ ఫ్రై, ఎగ్ న్యూడిల్స్, ఎగ్ బిర్యానీ లాంటి ఎన్నో రెసిపీలు తినే ఉంటాము. అయితే ఎప్పుడు తినే రెసిపీలు కాకుండా గుడ్డుతో ఏదైనా సరికొత్తగా రెసిపీ ట్రై చేయాలని అనుకుంటున్నారా. అయితే ఈ సరికొత్త రెసిపీ మీ కోసమే. ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఎగ్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఎగ్ కుర్మాకీ కావలసిన పదార్థాలు :

ఉడికించిన కోడిగుడ్లు – నాలుగు
ఉల్లిపాయలు – రెండు
పచ్చిమిర్చి – ఆరు
పాలు – ఒకటిన్నర కప్పు
జీలకర్ర – 3 టీ
ఆవాలు – ఒక టీ స్పూన్
కొత్తిమీరపొడి – 2 టీ స్పూన్స్
ధనియాలు – 1 టీ స్పూన్
గరంమసాలా పొడి – రెండు టీ స్పూన్
నూనె – తగినంత
ఉప్పు – సరిపడా

ఎగ్ కుర్మా చేయు విధానం:

ఇందుకోసం ముందుగా పచ్చిమిర్చి, జీలకర్రలను కలిపి కాసిన్ని నీళ్లుచేర్చి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. స్టవ్‌పై బాణలి ఉంచి, నూనె పోసి, వేడయ్యాక ఆవాలు, ధనియాలు వేసి రంగు మారేదాకా వేయించి, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి వేయించాలి. తరువాత అందులోనే పచ్చిమిర్చి ముద్దను కూడా చేర్చి 5 నిమిషాలు ఉడికించాలి. ఆపై అందులో పాలుపోసి కలియబెట్టాలి. ఈ మిశ్రమం ఉడికేటప్పుడు అందులో ఉడికించిన కోడిగుడ్లు వేసి మూతపెట్టి సన్నటి సెగపై ఉడికించాలి. కూర దగ్గరవుతుండగా, అందులో తగినంత ఉప్పు, గరంమసాలా పొడి, కొత్తిమీర పొడి వేసి కలపాలి. అలాగే మరో ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి. అంతే రుచికరమైన స్పైసీ ఎగ్ కుర్మా రెడీ.

  Last Updated: 25 Jan 2024, 04:09 PM IST