Site icon HashtagU Telugu

Hair Care Tips: గుడ్డు సొనలో రెండు స్పూన్లు ఇది మిక్స్ చేసి అప్లై చేస్తే చాలు.. జుట్టు మృదువుగా మారాల్సిందే.

Mixcollage 08 Feb 2024 05 17 Pm 6597

Mixcollage 08 Feb 2024 05 17 Pm 6597

మామూలుగా అమ్మాయిలు మెరిసే ఒత్తైన దృడమైన జుట్టు కావాలని కోరుకుంటూ ఉంటారు. అమ్మాయిలు నల్లటి పొడవాటి జుట్టునే ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో అనేక రకాల కారణాల వల్ల చుండ్రు, హెయిర్ ఫాల్ వంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే నల్లటి పొడవైన ఒత్తైనా జుట్టు కావాలి అంటే కోడుగుడ్డును ఉపయోగించాల్సిందే. మరి కోడి గుడ్డుతో జుట్టును ఎలా పెంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గుడ్డులో ప్రొటీన్‌, బయోటిన్‌, విటమిన్‌ ఎ, డి, ఇ, కె, బి వంటి పోషకాలు, అమైనో యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి.

ఇవి జుట్టు కదుళ్లను దృఢంగా ఉంచుతాయి. పట్టులాంటి జుట్టును అందిస్తాయి. పట్టులాంటి జుట్టు కోసం రెండు గుడ్లను ఒక బౌల్‌లో బీట్‌ చేసి, ఈ మిశ్రమాన్ని జుట్టు మూలల నుంచి, చివర్ల వరకు పట్టించాలి. మీ జుట్టును షవర్‌ క్యాప్‌ తో కవర్‌ చేసి 20 – 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి. గుడ్డులో ఉండే ప్రొటీన్‌ జుట్టును రిపేర్‌ చేయడానికి, జుట్టు కుదుళ్లను దృఢంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇది జుట్టుకు తేమను అందించి, పట్టులా ఉంచుతుంది.

ఒక బౌల్‌లో గుడ్డు పగలగొట్టి బీట్‌ చేయాలి. దీనిలో పెరుగు వేసి బాగా మిక్స్‌ చేసి, ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయాలి. దీన్ని 20 నిమిషాల పాటు ఆరనిచ్చి సున్నితమైన షాంపూతో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్‌ వారానికి రెండు సార్లు వేస్తే జుట్టు కదుళ్లను దృఢంగా ఉంచుతుంది. హెయిర్‌ ఫాల్‌ సమస్యను దూరం చేస్తుంది. జుట్టుకు తేమను అందించి, మృదువుగా మారుస్తుంది. అలాగే జుట్టు చిట్లిపోతే దీన్ని రిపేర్‌ చేయడానికి పచ్చసొనలో కొంచెం కొబ్బరినూనె, తేనె మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి మర్దనా చేయాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు బలంగా, మృదువుగా మారుతుంది. అలాగే జుట్టు చిట్లిపోయే సమస్య దూరమవుతుంది.