కోడిగుడ్డు(Egg) ఆరోగ్యానికి చాలా మంచిదని, అందులో ఎన్నో పోషకాలు ఉంటాయని, రోజుకొక గుడ్డు అయినా తినాలని డాక్టర్లు(Doctors) చెప్తుంటారు. గుడ్డు అందరికి హెల్త్ కి మంచిదని మనకు తెలుసు. నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఆరోగ్యం(Health) కోసం గుడ్డుని తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అయితే కోడిగుడ్డు ఆరోగ్యం కోసం మాత్రమే కాదు అందానికి కూడా వాడతారు.
సౌందర్య సాధనంగా కూడా కోడి గుడ్డుని వినియోగిస్తారు. మన ముఖానికి ఎగ్ మాస్క్ వేసుకుంటే ముఖం ఎంతో ప్రకాశవంతంగా మారుతుంది. ఇంట్లోనే మనమే ఇది తయారుచేసుకొని ముఖానికి వేసుకోవచ్చు. ఎగ్ మాస్క్ వేసుకోవడానికి ఒక కోడిగుడ్డు తెల్ల సొన, ఒక టీస్పూన్ నిమ్మరసం, ఒక టీ స్పూన్ తేనె తీసుకోవాలి. ఒక చిన్న బౌల్ లో ఈ మూడింటిని బాగా కలిపి ఒక మిశ్రమంలా తయారు చేయాలి.
అనంతరం ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని ముఖంపై లేయర్ లా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఒక పావుగంట సేపు ఆరనివ్వాలి. అనంతరం ముఖాన్ని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారైనా చేస్తే ముఖం కాంతివంతంగా మారడమే కాకుండా ముఖంపై మొటిమల సమస్య, నల్ల మచ్చల సమస్య కూడా తగ్గుతుంది. ముఖం చూడటానికి అందంగా తయారవుతుంది. కాబట్టి ఈ కోడిగుడ్డు మాస్క్ ట్రై చేసి ముఖానికి నిగారింపుని తెచ్చుకోండి.
Also Read : Milk: వామ్మో.. పాలు తాగడం వల్ల అన్ని రకాల ప్రయోజనాలా?