Egg Dum Biryani: రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ధమ్ బిర్యానీ.. ఇంట్లోనే చేసుకోండిలా?

సాధారణంగా చాలామంది ఇంట్లో అమ్మలు ఎంత టేస్టీగా వంటకాలు తయారు చేసినా కూడా ఎక్కువగా బయట ఫుడ్ ని ఇష్టపడుతూ ఉంటారు. చాలా మంది మహిళలు పిల్లలకు

Published By: HashtagU Telugu Desk
Mixcollage 17 Jan 2024 08 04 Pm 7334

Mixcollage 17 Jan 2024 08 04 Pm 7334

సాధారణంగా చాలామంది ఇంట్లో అమ్మలు ఎంత టేస్టీగా వంటకాలు తయారు చేసినా కూడా ఎక్కువగా బయట ఫుడ్ ని ఇష్టపడుతూ ఉంటారు. చాలా మంది మహిళలు పిల్లలకు నచ్చిన విధంగా బయట తయారు చేసినట్టు టేస్టీగా తయారు చేయాలి అనుకున్నప్పటికీ వారిని ఎలా చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటారు. మీరు కూడా అలా రెస్టారెంట్ స్టైల్ లో ఏదైనా ఒక రెసిపీని ట్రై చేయాలని అనుకుంటున్నారా. అయితే ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే ఎగ్ దమ్ బిర్యాని ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఎగ్ ధమ్ బిర్యానీకి కావాల్సిన పదార్ధాలు:

కొత్తిమీర – పావు కప్పు
పుదీనా – పావు కప్పు
ఉల్లిపాయ తరుగు – పావు కప్పు
ఉడికించిన గుడ్లు – అయిదు
దాల్చిన చెక్క – ఒకటి
లవంగాలు – అయిదు
యాలకులు – నాలుగు
షాహీ జీరా – ఒక టీ స్పూన్
అనాస పువ్వు – రెండు
బిర్యానీ ఆకులు – రెండు
నల్ల యాలుక – ఒకటి
ఉప్పు – తగినంత
కారం – రెండు టీ స్పూన్స్
ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్
వేపిన జీలకర్ర పొడి – ఒక టేబుల్ స్పూన్
గరం మసాలా – ముప్పావు టేబుల్ స్పూన్
అల్లం వెల్లులి ముద్ద – ఒక టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి – నాలుగు
పెరుగు – అర కప్ప
బాస్మతి బియ్యం – పావు కె. జి
నిమ్మకాయ – ఒకటి

ఎగ్ ధమ్ బిర్యానీ తయారీ విధానం:

ఉడకపెట్టుకున్న గుడ్లని ఒక గిన్నె లోకి తీసుకుని అందులో మసాలా కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి బాగా కలుపుతూ కోడి గుడ్లకి పట్టించాలి. ఎసరు నీళ్ళలో ఉప్పు, మసాలా దినుసులన్నీ వేసి 2-3 నిమిషాలు మరగనివ్వాలి. తరువాత బాస్మతి బియ్యం, పచ్చిమిర్చి చీలికలు, నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర వేసి బాగా ఉడికించుకోవాలి. ఉడికిన అన్నాన్ని మసాలా దినుసులతో పాటు వడకట్టి ముందుగానే కలిపి పెట్టుకున్న కోడి గుడ్ల మసాలా మీద వేయాలి. బిర్యానీ రైస్ మీద నెయ్యి, కుంకుమ పువ్వు నీళ్ళు, గరం మసాలా, పుదీనా తరుగు వేసి ధమ్ బయటకి పోకుండా గట్టిగా మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాలు ధమ్ చేసి స్టౌ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత 15 నిమిషాలు వదిలేయాలి. అంతే రుచికరమైన ఎగ్ దమ్ బిర్యాని రెడీ.

  Last Updated: 17 Jan 2024, 08:05 PM IST