Site icon HashtagU Telugu

Egg Chat: సాయంత్రం స్నాక్స్ గా ఎగ్ చాట్ ఇలా చేస్తే చాలు.. పిల్లలు లొట్టలు వేసుకుని మరీ తినేస్తారు?

Mixcollage 15 Mar 2024 07 22 Pm 9122

Mixcollage 15 Mar 2024 07 22 Pm 9122

సాయంత్రం అయింది అంటే చాలు చిన్న పిల్లలు ఆఫీస్ కి వెళ్ళిన వారు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక స్నాక్ ఐటం తినాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడు ఒకే విధమైన స్నాక్స్ కాకుండా అప్పుడప్పుడు కొత్త కొత్తగా ట్రై చేయాలని అనుకుంటూ ఉంటారు. మీరు కూడా అలా ఏదైనా సరికొత్తగా రెసిపీ ట్రై చేయాలనుకుంటున్నారా. అయితే సాయంత్రం సమయంలో స్నాక్స్ గా ఎగ్ చాయుట్ ను టేస్టీగా తయారు చేసుకోండిలా. మరి ఈ రెసిపీ ని ఎలా తయారు చేయాలి అన్న విషయానికి వస్తే..

కావాల్సిన పదార్థాలు :

ఉడకబెట్టిన గుడ్లు – మూడు
ఉల్లిపాయ – ఒకటి
పచ్చిమిర్చి – రెండు
టమోటోలు – ఒకటి
వెల్లుల్లి రెబ్బలు – రెండు
కారం – అరస్పూను
పసుపు – పావు స్పూను
ఛాట్ మసాలా – అర స్పూను
కరివేపాకులు – గుప్పెడు
ఉప్పు – తగినంత
పుదీనా తరుగు – ఒక స్పూను
కొత్తిమీర తరుగు – ఒక స్పూను
నూనె – రెండు స్పూనులు

తయారీ విధానం :

ఉడకబెట్టిన గుడ్లను పెంకులు ఒలిచి, పసుపు బాగాన్ని , తెల్ల బాగాన్ని వేరు చేయాలి. తర్వాత పసుపు బాగాన్ని పొడిలా చేయాలి. తెల్ల భాగాన్ని కాస్త పెద్ద ముక్కల్లా కట్ చేయాలి. ఆపై స్టవ్ పై కడాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి తరుగు, కరివేపాకులు, టొమాటో తరుగు వేసి వేయించాలి. అవి బాగా వేగాక కారం, పసుపు, ఛాట్ మసాలా, ఉప్పు వేసి కలపాలి. ఆ మిశ్రమంలో కాస్త నీళ్లు పోసి మూత పెట్టి మరిగించాలి. కూర మగ్గాక అందులో పుదీనా, కొత్తిమీర తురుము వేసి కలపాలి. తరువాత పొడిలా చేసుకున్న మిశ్రమాన్ని వేసి కలపాలి. చివర్లో తెల్లగుడ్డు ముక్కల్ని కూడా వేసి కలపాలి. అంతే టేస్టీ ఎగ్ ఛాట్ రెడీ.

Exit mobile version