Hair Care Tips: మందారపువ్వులతో జుట్టు సమస్యలు దూరం అవుతాయా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

చాలామంది స్త్రీ పురుషులకు కాలంతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో జుట్టుకు సంబంధించిన సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా జుట్టు రాలిపోవ

  • Written By:
  • Publish Date - August 16, 2023 / 09:00 PM IST

చాలామంది స్త్రీ పురుషులకు కాలంతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో జుట్టుకు సంబంధించిన సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా జుట్టు రాలిపోవడానికి చుండ్రు సమస్య ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. జుట్టు విపరీతంగా రాలిపోవడం వల్ల జుట్టు పలుచగా మారిపోతుంది. అటువంటి వారు తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సమస్యలకు మార్కెట్లో దొరికే రకరకాల బ్యూటీ పార్లర్ షాంపులను ఉపయోగించడం మానేసి హోమ్ రెమెడీస్ ని ఫాలో అవ్వడం మంచిది. అలాగే హోమ్ రెమిడీస్ ఫాలో అయ్యేటప్పుడు కూడా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

మరి అందుకోసం ఎటువంటి చిట్కాలు పాటించాలి? అలాగే జుట్టు సమస్యలకు మందారం పనిచేస్తుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. జట్టు రాలే సమస్యకు ఉల్లిపాయ బాగా ఉపయోగపడుతుంది. ఉల్లిరసంలోని యాంటిబాక్టీరియల్‌ గుణాలు తలలోని బాక్టీరియా, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. అందుకే ఉల్లిపాయను ముక్కలుగా కోసి వాటిని నుంచి వచ్చే రసాన్ని దూదితో మీ జుట్టుపై అప్లై చేయండి. ఇలా 30-50 నిమిషాల పాటు ఉంచుకోవాలి. అనంతరం మీ జుట్టును నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం మీ జుట్టు పలుచబడకుండా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లకు రక్తం బాగా సరఫరా అయ్యేలా చేస్తుంది. జుట్టుకు సంబంధించిన సమస్యలను నయం చేయడంలో మందార పువ్వులు మందార ఆకులు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. ఇందుకోసం మందార ఆకులు, మందార పువ్వులను గ్రైండ్ చేసి పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో పెరుగు వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని మీ మాడుకు, జుట్టుకు అప్లై చేసి ఒక గంట సేపు ఆరానివ్వాలి. అనంతరం గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ చిట్కాను ఉపయోగించడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. అదేవిధంగా అలోవెరా నుంచి గుజ్జు తీసి దానిని మీ మాడుకు పట్టించాలి. ఒక గంట లేదా రెండు గంటలు ఇలా ఉంచాలి. అనంతరం గోరువెచ్చని నీటితో తలను శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. తలస్నానం చేసేముందు కొబ్బరి నూనెను గోరువెచ్చగా కాచి తలకు రుద్దుకుని మర్దనా చేసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల తలకు బాగా రక్తప్రసరణ జరిగి కుదుళ్లు గట్టిపడతాయి. మందార పువ్వులో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇది జుట్టుకి పోషణనిస్తుంది. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టుని ఒత్తుగా చేస్తుంది. ఇందులోని నూనె, హెయిర్ ప్యాక్ జుట్టుని బలంగా చేయడంతో పాటు జుట్టు పెరిగేలా చేస్తుంది.