Site icon HashtagU Telugu

Dark Elbows: మోచేతులపై నలుపుదనం పోవాలంటే ఏం చేయాలో తెలుసా?

Dark Elbows

Dark Elbows

సాధారణంగా చాలామందికి బాడీ మొత్తం తెలుపు రంగులో ఉన్న కూడా మోచేతులు అలాగే మోకాళ్లు నల్లగా ఉంటాయి. అలా నల్లగా ఉంటే చూడడానికి అసలు బాగోదు. అందుకే మోచేతులపై ఉన్న నల్లధనాన్ని పోగొట్టుకోవడం కోసం చాలామంది మార్కెట్ లో దొరికే రకరకాల క్రీమ్స్ బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మోచేతులపై ఉన్న నల్లధనం పోవాలి అంటే కొన్ని రకాల చిట్కాలను పాటించాల్సిందే. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బాదంపప్పు : బాదంపప్పుని తీసుకుని పచ్చిపాలలో నానబెట్టి తర్వాత వాటిని మొత్తని పేస్టులా చేసి అప్లై చేస్తే మోచేతిపై నలుపు తగ్గుతుంది.

అలోవేరా : కలబంద చర్మ సమస్యలకి, చర్మ సౌందర్యానికి మంచి ఔషధం అని చెప్పవచ్చు. అటువంటి అలోవేరా జెల్ తీసుకుని అందులో కాస్తా తేనె కలిపి మోచేతులకి రాయడం వల్ల మోచేతులపై ఉన్న నలుపు తగ్గుతుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి.

పసుపు : మోచేతులపై ఉన్న నలుపుదనాన్ని పోగొట్టడానికి పసుపు కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి పసుపు తేనె, పాలు మూడింటిని సమానంగా తీసుకోని పేస్టులా తయారుచేసి మోచేతులపై అప్లై చేసి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

కొబ్బరినూనె: కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి మిక్స్ చేసి మోచేతులపై అప్లై చేసి ఆ ఆ తర్వాత క్లీన్ చేయాలి.

పంచదార : చక్కెర, ఆలివ్ నూనెని కలిపి మోచేతుల పై అప్లై చేయడం వల్ల నలుపుదనం సమస్య చాలా వరకు తగ్గిపోతుంది.

శనగపిండి : శనగపిండి తీసుకుని అందులో పెరుగు కలపి దానిని మోచేతులపై రాసిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

పుదీనా : పుదీనా ఆకుల్ని తీసుకుని మెత్తగా రుబ్బుకొని మోచేతులపై అప్లై చేసి ఆరిన తర్వాత క్లీన్ చేయాలి.