Site icon HashtagU Telugu

‎Reduce belly Fat: రోజు పడుకునే ముందు ఇది రెండు చెంచాలు తాగి పడుకుంటే చాలు.. పొట్ట ఐస్ లా కరిగిపోవడం ఖాయం!

Reduce Belly Fat

Reduce Belly Fat

‎Reduce belly Fat: ఇటీవల కాలంలో చాలా మంది అధిక బరువు బెల్లీ ఫ్యాట్ వంటి సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే బరువు పెరగడం అన్నది ఈజీనే కానీ బరువు తగ్గడం అన్నది చాలా కష్టంతో కూడుకున్న పని. బరువు తగ్గడం కోసం బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడం కోసం ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. జిమ్ కి వెళ్లడం, ఎక్సర్సైజులు చేయడం డైట్లు ఫాలో అవ్వడం ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

‎అయినా కూడా కొన్నిసార్లు బరువు తగ్గరు. అయితే ఏం చేయాలో ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతిరోజు రాత్రిపూట కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలట. తిన్న వెంటనే వజ్రాసనంలో కూర్చొవాలట. అంతే కాకుండా డైలీ రాత్రిపూట చెంచాడు గోరు వెచ్చని నీళ్లను తీసుకొవాలి. దీనిలో తేనె, రెండు లవంగాలు, కొంచెం జీలకర్ర వేయాలట. దీన్ని చక్కగా కలిపి రెండు స్పూన్ లు డైలీ తాగాలని చెబుతున్నారు. తేనెలో మిరియాలు, నిమ్మకాయ రసంతో కల్పి రెండు స్పూన్ లు రోజు రాత్రి బెడ్ టైమ్ లో తాగాలి.

‎ఇలా డైలీ చేస్తుంటే ఒక వారంలో మీ బరువు దాదాపుగా 5 కేజీల వరకు తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా క్రమంగా శరీరంలో మార్పులు కూడా వస్తాయట. మరీ ముఖ్యంగా బెల్లి ఫ్యాట్ తో బాధపడేవారు ఈ సింపుల్ కిచెన్ రెమిడీలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవట. అయితే ఇవి ట్రై చేయడంతో పాటు బయట దొరికే జంక్ ఫుడ్స్ వంటివి అవాయిడ్ చేయాలని చెబుతున్నారు. అలాగే రాత్రిపూట తిన్న తర్వాత వాకింగ్ చేయడం వంటివి అలవాటు చేసుకోవాలని తిని అలాగే కూర్చుంటే మరింత బరువు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

Exit mobile version