Cracked Heels: పాదాలు పగుళ్లతో ఇబ్బందిపడుతున్నారా.. అయితే ఇలా చేయండి?

చాలామంది స్త్రీ పురుషులు పాదాల పగుళ్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు. పాదాల పగుళ్ల సమస్య కారణంగా నడవడానికి రాత్రి సమయంలో పడుకోవడానికి కూడా ఇబ్బంది

  • Written By:
  • Publish Date - July 19, 2023 / 09:30 PM IST

చాలామంది స్త్రీ పురుషులు పాదాల పగుళ్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు. పాదాల పగుళ్ల సమస్య కారణంగా నడవడానికి రాత్రి సమయంలో పడుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరికి ఇలా పాదాల పగుళ్లు ఏర్పడి రక్తం కూడా వస్తూ ఉంటుంది. పాదాల మీద చర్మం త్వరగా పొడిబారుతుంది, ఎందుకంటే అక్కడ ఆయిల్ గ్లాండ్స్ ఉండవు. ఇలా పొడిబారడం వల్లే పగుళ్ళు కూడా ఏర్పడుతాయి. మాయిశ్చర్ లేకపోవడం, పొల్యూషన్ కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం, కొన్ని మెడికల్ కండిషన్స్ వంటికి కూడా పాదాల పగుళ్ళకి కారణాలవుతాయి. మరి పాదాల పగుళ్ల సమస్యలను ఎలా తగ్గించుకోవాలి?అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇందుకోసం అనేక రకాల చిట్కాలను పాటించాలి. అందులో మొదటిది ఒక బేసిన్ గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు, రెండు టేబుల్ స్పూన్ల గ్లిసరిన్, రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్ వేసి ఆ నీటిలో పాదాలు ఉంచి ఇరవై నిమిషాలు రిలాక్స్ అవ్వండి. మీ పాదాలని ప్యూమిస్ స్టోన్, లేదా ఫుట్ స్క్రబ్బర్ తో స్క్రబ్ చేసి పాదాలని మెత్తని బట్టతో తుడిచిన తరువాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. అలాగే మీ పాదాలని శుభ్రంగా వాష్ చేసి క్లీన్ టవల్‌తో శుభ్రంగా తుడవండి. ఒక లేయర్ వెజిటబుల్ ఆయిల్ పాదాలకి అప్లై చేయాలి. ఆ తరువాత పాదాలకి థిక్ సాక్స్ వేసుకుని రాత్రంతా అలాగే వదిలేసి, మరుసటి రోజు పొద్దున్న పాదాలు శుభ్రంగా వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.

అదేవిధంగా రెండు అరటి పండ్లు తీసుకుని వాటిని మెత్తగా చేసి ఆ పేస్ట్ ని పాదాలకి పట్టించండి, పగుళ్ళు ఉన్న చోట, పాదాల పక్కనా, కాలి వేళ్ళ మధ్యనా ప్రత్యేక శ్రద్ధతో అప్లై చేయాలి.. పదిహేను నిమిషాల తరువాత కడిగేయాలి. అలా ప్రతి రోజూ రాత్రి ఒక సారి మీకు ఫలితం కనిపించేవరకూ చేయండి. అయితే, బాగా పండిన అరటి పండ్లని మాత్రమే ఉపయోగించడం మంచిది. మరో రెమిడి విషయానికి వస్తే..ఒక టీ స్పూన్ తేనె, మూడు టీ స్పూన్ల బియ్యపిండి బాగా కలపండి. ఇందులో రెండు చుక్కల యాపిల్ సిడార్ వెనిగర్ కూడా వేసి మళ్ళీ కలపండి. మీ పాదాలని గోరు వెచ్చని నీటిలో పది నిమిషాల పాటూ ఉంచి ఈ పేస్ట్ తో మృదువుగా స్క్రబ్ చేయండి. ఇలా వారానికి రెండు సార్లో మూడు సార్లో మాత్రమే చేయండి, అంతకంటే ఎక్కువగా ఎక్స్ఫోలియేట్ చేయడం మంచిది కాదు. యాపిల్ సిడార్ వెనిగర్ ఎక్కువగా యూజ్ చేస్తే అందులో ఉండే హై ఎసిడిక్ కంటెంట్ వల్ల స్కిన్ ఇరిటేట్ అవుతుంది, జాగ్రత్త.

ఒక బేసిన్ గోరు వెచ్చని నీరు తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా కలపండి. ఆ నీటిలో మీ పాదాలు ఉంచి పదిహేను నిమిషాలు రిలాక్స్ అవ్వండి. ఆ తరువాత ప్యూమిస్ స్టోన్ తో స్క్రబ్ చేయండి. ఆ తరువాత పాదాలు శుభ్రంగా కడిగేసి మెత్తని బట్టతో అద్ది మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేయవచ్చు. ఒక టేబుల్ స్పూన్ ప్యారాఫిన్ వ్యాక్స్‌లో రెండు మూడు చుక్కల కోకోనట్ ఆయిల్ కానీ, మస్టర్డ్ ఆయిల్ కానీ కలపండి. ఇవి రెండు బాగా కలిసేవరకూ వీటిని వెచ్చబెట్టండి. ఈ మిశ్రమాన్ని చల్లార్చి పాదాలకి అప్లై చేయండి. సాక్స్ తో కవర్ చేసుకుని నిద్రపోండి. వారానికి రెండు సార్లు ఇలా చేయండి. మీకు డయాబెటీస్ ఉంటే మాత్రం ఈ చిట్కా పాటించకండి. ఒక అర బకెట్ గోరు వెచ్చని నీటిలో ఒక కప్పు తేనె వేసి ఆ నీటిలో మీ పాదాలు ఉంచి ఇరవై నిమిషాలు ఉంచండి. ఆ తరువాత మృదువుగా స్క్రబ్ చేసి డెడ్ స్కిన్ ని రిమూవ్ చేయండి. ఆ తరువాత పాదాలు శుభ్రంగా కడిగేసి, మెత్తని బట్టతో అద్ది మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఇలా రోజూ చేయవచ్చు.