Site icon HashtagU Telugu

Cracked Heels: కాళ్ల పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే?

Gettyimages 1215901656 42fc2019cafe463ea3de9f9d70befba7

Gettyimages 1215901656 42fc2019cafe463ea3de9f9d70befba7

మామూలుగా స్త్రీ పురుషులకు కాళ్ల పగుళ్ల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు నొప్పి భరించలేని విధంగా ఉంటుంది. పురుషులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా స్త్రీలు ఈ కాళ్ళ పగుల సమస్యలను తగ్గించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాటి నుంచి రక్తం కూడా వస్తూ ఉంటుంది. బ్యూటీ పార్లర్ కు వెళ్లడంతో పాటు ఎన్నెన్నో కెమికల్ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే హోమ్ రెమిడీస్ ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయినా కూడా కాళ్ళ పగుళ్ల సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఎక్కువ సేపు వేడి నీళ్ళతో స్నానం చేయడం, హార్ష్ గా ఉండే సోప్స్, క్రీంస్ యూజ్ చేయడం, మరీ వేడీగా లేదా మరీ చల్లగా ఉండే వాతావరణం వంటివి పాదాల పగుళ్ళకి దారి తీస్తాయి. కావలసినంత నీరు తాగకపోవడం వలన కూడా ఈ సమస్య వస్తుంది. డయాబెటీస్, పోషకాహార లేమి, ఒబేసిటీ వంటివి కూడా పాదాల పగుళ్ళకి దారి తీస్తాయి. కొబ్బరి నూనె, లేదా వాజలీన్ పట్టించండం జనరల్ గా అందరం ఫాలో అయ్యే పద్ధతులు. కానీ, కిచెన్ లోనే ఉండే ఇంకొన్ని ఇంగ్రేకడియెంట్స్ తో ఈ ప్రాబ్లం ని ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ముందుగా పాదాల వద్ద ఉన్న డెడ్ సెల్స్ ని స్క్రబ్ చేయాలి.

దీనికోసం వేడినీటిలో కొంత సోప్ వేసి, ఆ నీటిలో మీ పాదాలు మునిగేటట్లుగా ఉంచండి. మీకు సరిపడే వేడిలో ఉన్న నీరు తీసుకోవడం మర్చిపోకండి. స్కిన్ కొంత సాఫ్ట్ గా అయ్యాక ప్యుమిస్ స్టోన్ తో స్క్రబ్ చేస్తే డెడ్ స్కిన్ అంతా వచ్చేస్తుంది. ఈ పని రాత్రి చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి. మీరు పాదాలని వేడి నీటిలో ఉంచి స్క్రబ్ చేసిన తరువాత పాదాలకి కొబ్బరినూనె బాగా పట్టించి క్లీన్ కాటన్ సాక్స్ వేసుకోవాలి. పొద్దున్న సాక్స్ తీసేసి పాదాలని నార్మల్ గా వాష్ చేసుకోవాలి. ఇలాగే వెజిటబుల్ ఆయిల్ తో కూడా చేయవచ్చు..

అదేవిధంగా మీరు పాదాలను ఉంచే వేడి నీటిలోనే రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేసి పాదాలు పది నిమిషాలు సోక్ చేయాలి. మీ పాదాలకి ఉన్న పగుళ్ళు మరీ డీప్ గా ఉంటే ముందు వాటికి కొంచెం నువ్వుల నూనె పట్టించి అప్పుడు సోక్ చేయాలి. మీరు పాదాలను ఉంచే వేడి నీటిలో అర కప్పు ఎప్సం సాల్ట్ వేసి పది నిమిషాలు సోక్ చేసి అప్పుడు ప్యుమిస్ స్టోన్ తో స్క్రబ్ చేయాలి వేడి నీటిలో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, రెండు టేబుల్ స్పూన్ల గ్లిసరిన్, రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్ వేయండి. పదిహేను నిమిషాలు పాదాలు ఇందులో సోక్ చేసిన తరువాత స్క్రబ్ చేయాలి.

Exit mobile version