Site icon HashtagU Telugu

Cracked Heels: పాదాల పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే చేయాల్సిందే?

Cracked Heels

Cracked Heels

చాలామంది స్త్రీ పురుషులు పాదాల పగుళ్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు. పురుషులు అంతగా పట్టించుకోకపోయినప్పటికీ స్త్రీలు మాత్రం ఈ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. హోమ్ రెమెడీస్ ని ఫాలో అవడంతో పాటు మార్కెట్లో దొరికే రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మామూలుగా ఆధార మీద చర్మం త్వరగా పొడిబారడానికి కారణం అక్కడ ఆయిల్ గ్లాండ్స్ ఉండవు కాబట్టి. అయితే వీటిని తగ్గించుకోవాలి అంటే ఈ కింద చిట్కాలను పాటించాల్సిందే. మరి ఎటువంటి చిట్కాలు పాటించి పాదాల పగుళ్ల సమస్య నుంచి బయటపడాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సాల్ట్, గ్లిసరిన్, రోజ్ వాటర్…. ఒక బేసిన్ గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు, రెండు టేబుల్ స్పూన్ల గ్లిసరిన్, రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్ వేసి ఆ నీటిలో పాదాలు ఉంచి ఇరవై నిమిషాలు రిలాక్స్ అవ్వండి. మీ పాదాలని ప్యూమిస్ స్టోన్, లేదా ఫుట్ స్క్రబ్బర్ తో స్క్రబ్ చేయండి. పాదాలని మెత్తని బట్టతో తుడిచిన తరువాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.

వెజిటబుల్ ఆయిల్…. మీ పాదాలని శుభ్రంగా వాష్ చేసి క్లీన్ టవల్‌తో శుభ్రంగా తుడవండి. ఒక లేయర్ వెజిటబుల్ ఆయిల్ పాదాలకి అప్లై చేయండి. ఆ తరువాత పాదాలకి థిక్ సాక్స్ వేసుకుని రాత్రంతా అలాగే వదిలేసి మరుసటి రోజు ఉదయం పాదాలు శుభ్రంగా వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.

బనానా మాస్క్…రెండు అరటి పండ్లు తీసుకుని వాటిని మెత్తగా చేయండి. ఈ పేస్ట్ ని పాదాలకి పట్టించండి, పగుళ్ళు ఉన్న చోట, పాదాల పక్కనా, కాలి వేళ్ళ మధ్యనా ప్రత్యేక శ్రద్ధతో అప్లై చేయండి. పదిహేను నిమిషాల తరువాత కడిగేయండి. ప్రతి రోజూ రాత్రి ఒక సారి మీకు ఫలితం కనిపించేవరకూ చేయండి. అయితే, బాగా పండిన అరటి పండ్లని మాత్రమే వాడండి, కొద్దిగా పచ్చిగా ఉన్న అరటి పండ్లలో ఉండే యాసిడ్ స్కిన్ కి కొంచెం హార్ష్ గా ఉంటుంది.

తేనె, బియ్యప్పిండి, యాపిల్ సిడార్ వెనిగర్… ఒక టీ స్పూన్ తేనె, మూడు టీ స్పూన్ల బియ్యపిండి బాగా కలపండి. ఇందులో రెండు చుక్కల యాపిల్ సిడార్ వెనిగర్ కూడా వేసి మళ్ళీ కలపండి. మీ పాదాలని గోరు వెచ్చని నీటిలో పది నిమిషాల పాటూ ఉంచి ఈ పేస్ట్ తో మృదువుగా స్క్రబ్ చేయండి. ఇలా వారానికి రెండు సార్లో మూడు సార్లో మాత్రమే చేయండి, అంతకంటే ఎక్కువగా ఎక్స్ఫోలియేట్ చేయడం మంచిది కాదు.

బేకింగ్ సోడా…. ఒక గిన్నెలో గోరు వెచ్చని నీరు తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా కలపాలి. ఆ నీటిలో మీ పాదాలు ఉంచి పదిహేను నిమిషాలు రిలాక్స్ అవ్వండి. ఆ తరువాత ప్యూమిస్ స్టోన్ తో స్క్రబ్ చేయాలి. ఆ తరువాత పాదాలు శుభ్రంగా కడిగేసి మెత్తని బట్టతో అద్ది మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేయవచ్చు.