Site icon HashtagU Telugu

Underarms: చంకల్లో నలుపు తగ్గాలంటే ఈ చిట్కాలను పాటించాల్సిందే?

Underarms

Underarms

మాములుగా చాలామంది స్త్రీ, పురుషులు చంకల్లో నలుపు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఇందుకోసం రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ని, హోమ్ రెమిడీస్ ఫాలో అవుతూ ఉంటారు. అయితే మరి చంకల్లో నలుపును ఎలా పోగొట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చర్మంపై రంగు మారడం అనేది సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. చర్మంలో ఎక్కడైనా సరే సమస్య కలగవచ్చు. నిజానికి ఈ సమస్య వచ్చిందంటే కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా అండర్ అర్మ్స్‌లో ఈ సమస్య వచ్చిందంటే దాని నుండి బయట పడటం కొంచెం కష్టం. పైగా కొన్ని రకాల దుస్తులు ధరించడానికి కూడా అవ్వదు. మెలనిన్ లేదా మెలనోసైట్స్ పెరిగిపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది.

అయితే కొన్ని రకాల డియోడరెంట్స్ వాడటం వల్ల చర్మం ఇరిటేట్ అవుతోంది. దీంతో చర్మం నల్లగా మారుతుంది. అంతేకాకుండా హెయిర్ రిమూవల్ టెక్నిక్ ఫాలో అవడం కూడా ఈ సమస్య వస్తుంది. షేవింగ్, వ్యాక్సింగ్ వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. కాబట్టి ఇటువంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. ఈ పద్ధతిని అనుసరించినప్పుడు గాయాలవుతాయి దీని కారణంగా మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. దీని మూలంగానే చర్మం నల్లగా మారే అవకాశం కూడా ఉంటుంది. అదే విధంగా ఎక్స్‌ఫోలియేషన్ లేక పోవడం వల్ల నల్లగా మారే అవకాశం ఉంటుంది హార్మోనల్ ఇన్‌బాలన్స్ కూడా అవుతుంది. మీ అండర్ ఆర్మ్స్ కనుక నల్లగా మారి పోతూ ఉంటే మీ డియోడ్రెంట్ బ్రాండ్‌ని మార్చాలి. ఇలా మార్చడం వల్ల ఈ సమస్య లేకుండా ఉండవచ్చు. రేజర్ కారణంగా ఇరిటేషన్ కలుగుతుంది.

కనుక మీరు దీనిని ఉపయోగించినప్పుడు ఎక్కువ ప్రెషర్‌ని పెట్టకూడదు. ఈ టెక్నిక్ ఫాలో అవడం కూడా మీకు సమస్య ఉండదు. సన్ స్క్రీన్ లోషన్‌ను ఉపయోగించడం వల్ల కూడా చర్మం నల్లగా మారకుండా ఉంటుంది. ఏ సీజన్‌లో అయినా మీరు దీనిని ఉపయోగించవచ్చు. దీని కారణంగా చర్మం నల్లగా అవకుండా ఉంటుంది. టైట్‌గా ఉండే బట్టలు వేసుకోవడం వల్ల హైపర్ పిగ్మెంటేషన్ సమస్య కలుగుతుంది. కాబట్టి కాస్త వదులుగా ఉండే దుస్తులు వేసుకోవాలి. ఫిట్నెస్ లెవెల్స్ పైన కూడా మీరు వర్కౌట్ చేయండి. అలానే బరువు తగ్గడం వల్ల కూడా చర్మం నల్లగా మారకుండా ఉంటుంది. చూశారు కదా డెర్మటాలజిస్ట్ షేర్ చేసిన అద్భుతమైన చిట్కాలని. మరి వీటిని ఫాలో అయ్యి చర్మం నల్లగా అవకుండా చూసుకోవాలి.