Site icon HashtagU Telugu

Under Arms: చంకలు నల్లగా మారాయా.. అయితే ఇలా చేయాల్సిందే?

Under Arms

Under Arms

ప్రస్తుత రోజుల్లో చాలామంది మహిళలు అండర్ అర్మ్స్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య కారణంగా చాలామంది లోలోపల మధనపడుతూ ఎందుకు ఇలా అయింది? దీని వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయా? సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? ఇన్ఫెక్షన్స్ అవుతాయా?అంటూ ఇలా అనేక రకాల ప్రశ్నలు వేసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటారు. చాలామంది యువతులు ఈ సమస్య కారణంగా స్లీవ్ లెస్ డ్రెస్ లను వేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. కాగా అండర్ అర్మ్స్ సమస్యకు చెక్ పెట్టడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు.

అయితే మామూలుగా చర్మంపై రంగు మారడం అన్నది కామన్. శరీరం అంత ఒక రంగు ఉన్న మన చంకల్లో రంగు మారడం అన్నది సహజంగా జరుగుతూ ఉంటుంది. చంకల్లో రంగు మారితే చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఒకసారి నలుపు రంగు వచ్చింది అంతే పోవడం అంత సులువు కాదు. హెయిర్ రిమూవల్ టెక్నిక్స్ తెలియకపోతే, కొన్ని రకాల డియోడరెంట్స్ యూజ్ చేయడం వల్ల కూడా స్కిన్ కలర్ మారుతుంది. మరి చంకలు నల్లగా మారకుండా ఉండాలంటే ఎటువంటి చిట్కాలను ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చంకలు నల్లగా మారుతుంటే మీ డియోడ్రెంట్ బ్రాండ్ ను ఛేంజ్ చేయాలి. దీనివల్ల మీకు అండర్ ఆర్మ్స్ సమస్య తగ్గవచ్చు. రేజర్ కారణంగా స్కిన్ ఇరిటేషన్ కు గురవుతుంది. మరి ముఖ్యంగా షేవింగ్ సమయంలో ఎక్కువ ప్రెషర్ ను పెడితే ఈ సమస్య వస్తుంది. కాబట్టి షేవింగ్ చేసేటప్పుడు ప్రెజర్ ఎక్కువ పెట్టకూడదు. చంకలు నల్లగా మారకూడ ఉండాలంటే సీజన్ తో సంబంధం లేకుండా సన్ స్ట్రీన్ లోషన్ ను ఉపయోగించాలి. దీన్ని అప్లై చేయడం వల్ల కూడా అండర్ ఆర్మ్స్ సమస్య రాదు. అలాగే ఎప్పుడు మరీ బిగుతుగా ఉండే దుస్తులను కాకుండా లూస్ గా ఉండే వస్తువులను ఉపయోగించాలి. అలా బిగుతుగా ఉండే బట్టలు వేసుకుంటే హైపర్ పిగ్మెంటేషన్ సమస్య వస్తుంది. ఫిట్ గా ఉన్న వారికి ఈ అండర్ అర్మ్స్ సమస్య రాదు. ముఖ్యంగా శరీర బరువు మరీ ఎక్కువగా కూడా ఈ సమస్య వస్తుంది. కాబట్టి బరువును నియంత్రించండి.

Exit mobile version