Site icon HashtagU Telugu

Dark Underarms: చంకలు నల్లగా ఉన్నాయా.. అయితే ఈ చిట్కాలను పాటించాల్సిందే?

Dark Underarms

Dark Underarms

ఈ రోజుల్లో స్త్రీ పురుషులలో చాలామంది ఎదుర్కునే సమస్యలలో బ్లాక్ అండర్ ఆర్మ్స్ కూడా ఒకటి. చంకలలో నలుపును పోగొట్టుకోవడానికి ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. మరి కొంతమంది హోమ్ రెమెడీస్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్లీవ్ల్స్ లేని బట్టలు వేసుకున్నప్పుడు అటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటు ఉంటారు. మరి చంకల్లో నలుపుదనాన్ని ఏ విధంగా పోగొట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది అండర్ అర్మ్స్ కి డియోడరెంట్స్ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు.

దీని వల్ల కూడా చర్మం నల్లగా అయిపోవచ్చు. అదే విధంగా చర్మం రంగు మారడంతో పాటు ఇరిటేషన్ లాంటి ఇబ్బందులు కూడా కలుగుతాయి. కలబందని మనం ఎన్నో రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. ఆరోగ్యానికి అందానికి కూడా కలబంద ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మాన్ని అందంగా మార్చడానికి కలబంద హెల్ప్ చేస్తుంది. పైగా ఈ సమస్య నుండి ఇది బయట పడేస్తుంది. దీని కోసం మీరు ఒక కలబంద మట్ట తీసుకునే తొక్క తీసేసి గుజ్జుని తీసుకోవాలి. దానిని అండర్ ఆర్మ్స్ కి అప్లై చేయాలి. 15 నుండి 20 నిమిషాల పాటు అలానే వదిలేసి పూర్తిగా ఆరిన తర్వాత కడిగేసుకోవాలి.

ఈ పద్ధతిని మీరు రిపీట్ చేస్తూ ఉండడం చంకల్లో నలుపు ధనం సమస్యను పోగొట్టుకోవచ్చు. చాలా మందికి షేవ్ చేసిన తర్వాత క్రీమ్స్ వంటివి రాయరు. అయితే దీనివల్ల కూడా చర్మం నల్లగా మారిపోతుంది. అందుకనే షేవ్ చేసినప్పుడు లైటనింగ్ క్రీమ్స్ రాయాలి. కోజిక్ యాసిడ్ లాంటి వాటిని రాయడం వల్ల చర్మం బాగుంటుంది. అలానే స్కిన్ టోన్ మారిపోకుండా ఉంటుంది. అలాగే లేసర్ ట్రీట్మెంట్స్‌ని తీసుకోవచ్చు. వీటి వల్ల ఇబ్బంది ఉండదు. ఈ పద్ధతులను ఉపయోగించి కూడా ఈ సమస్యకి గుడ్ బై చెప్పవచ్చు. దీనితో అండర్ ఆర్మ్స్ నల్లగా అయ్యిపోవడం లాంటి ఇబ్బందులేమీ వుండవు.