Site icon HashtagU Telugu

Home Remedies : చేపలు వండితే ఇల్లంతా వాసనొస్తుందా ? ఈ టిప్స్ తో ఆ సమస్య ఉండదు

fish smell

fish smell

Home Remedies : వీకెండ్ వస్తే.. నాన్ వెజ్ ప్రియులకు అది లేనిదే గడవదు. ఆదివారమైతే ఖచ్చితంగా ముక్క తినాల్సిందే. ఇది చాలా మందికి అలవాటైన లైఫ్ స్టైల్. కొందరు బయట తింటే.. చాలామంది ఇళ్లలోనే నాన్ వెజ్ వండుకుంటారు. చికెన్, మటన్ వండినపుడు పెద్దగా వాసన రాకపోయినా.. చేపలు వండుకున్నపుడు ఇల్లంతా ఆ వాసనతో నిండిపోతుంది. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకుందాం.

ఓ గిన్నె వెనిగర్, కొద్దిగా గ్రౌండ్ కాఫీని కౌంటర్ టాప్ లో ఉంచితే.. చేపలు వండేటపుడు వాసన రాకుండా ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి వేయించినా ఆ వాసన దూరమవుతుంది.

చేపలకూర లేదా ఫ్రై చేశాక వీలైనంత త్వరగా కిచెన్ ను క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల వాసన త్వరగా తగ్గుతుంది. ముఖ్యంగా స్టవ్, కౌంటర్ టాప్స్ క్లీన్ చేయడం వల్ల వాసన రాదు.

చెడువాసనలను దూరం చేయడంలో దాల్చిన చెక్క బాగా పనిచేస్తుంది. వెనిగర్ నీటిలో దాల్చినచెక్క వేసి ఉంచితే మంచి వాసన వస్తుంది. దీనితోపాటు ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటే వాటిని కూడా వాడొచ్చు.

ఇంట్లో ఈ చిట్కాలేవీ పాటించడం ఇష్టంలేని వారు ఎయిర్ ఫ్రెష్ నర్స్ ను వాడొచ్చు. చేపలను వండిన వెంటనే వీటిని వాడకూడదు. కొద్దిసేపు ఫ్యాన్ వేసి ఉంచాక.. వీటిని వాడాలి. వీటి సువాసన మొత్తం ఇల్లంతా వ్యాపించి స్మెల్ రాకుండా చేస్తుంది.

చేపల ఫ్రై చేసేటపుడు ఒక పాన్ లో నీరు పోసి మరిగించాలి. అవి మరుగుతున్నపుడు 2-3 చెంచాల వెనిగర్ ను కలిపితే.. గాల్లో ఉన్న వాసనను దూరం చేస్తుంది.

నాన్ వెజ్ ముఖ్యంగా చేపలు వండినపుడు.. వాసన, పొగ ఎక్కువగా వచ్చినపుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ వాడటం మంచిది. ఈ చిమ్నీని వాడటం వల్ల వాసన పోతుంది. పొగకూడా రాదు.

Exit mobile version