శీతాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పెదవులు పగలడం అన్నది సహజం. వ్యాస్లిన్, లిబ్బామ్ వంటివి ఎంత పట్టించినా కూడా వెంటనే డ్రై అయిపోయి కొన్నిసార్లు పెదవుల నుంచి రక్తం కూడా వస్తూ ఉంటుంది. వాతావరణం చల్లగా ఉండటం, చలిగాలుల కారణంగా పెదవులు పొడిబారి పగులుతూ ఉంటాయి. విటమిన్ లోపం, శరీరంలోని తేమ శాతం తగ్గడం, పొగతాగడం, అలాగే పెదవులను తరచూ నాలుకతో తడి చేసుకుంటూ ఉండటం వల్ల కూడా పెదాలు పగులుతాయి. పగిలిన పెదవులు తిరిగి మృదువుగా మారాలంటే కొన్ని ఇంటి చిట్కాలు సహాయపడతాయి. కొన్ని వంటింటి చిట్కాలను ఉపయోగించడం వల్ల ఈ పెదవులు పగలడం లాంటి సమస్య నుంచి తొందరగా బయటపడటంతో పాటు పెదవులను మృదువుగా మార్చుకోవచ్చు.
పగిలిన పెదవులు తిరిగి మృదువుగా మారడానికి కలబంద ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. మీ పెదవులు పగిలితే కలబంద గుజ్జును పెదవులకు అప్లై చేచేయాలి. దీనిలోని పాలీశీకరైడ్లు గాయాన్ని నయం చేస్తాయి. కలబంద గుజ్జును పెదాలకు అప్లై చేసి అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాతా నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే పెదవులు మృదువుగా మారతాయి. పెదాల పగుళ్లకు వెన్నను మించిన పరిష్కారం లేదు. సమస్య తగ్గడంతో పాటు లేత గులాబీ రంగులో మెరిసిపోతాయి. చెంచా వెన్నకు చిటికెడు పంచదార యాడ్ చేసి సున్నితంగా స్క్రబ్ చేయాలి. ఇలా కాసేపు చేస్తే రక్తప్రసరణ సక్రమంగా జరిగి పెదాలు కాంతిమంతంగా కనిపిస్తాయి.
పగుళ్లు తగ్గేవరకు ఇలా వెన్న అప్లై చేస్తూ ఉండాలి. మీ పెదవులు పగిలితే తేనె మంచి మెడిసిన్‌లా పనిచేస్తుంది. రెండు చుక్కల తేనె తీసుకొని పెదాలపై మృదువుగా మర్దనా చేయాలి. ఇందులోని యాంటీమైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పగుళ్లు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తాయి. దీన్ని రోజూ పెదాలకు రాస్తూ ఉంటే మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది ఇన్‌ఫెక్షన్‌లను నివారించి, పగుళ్ల నుంచి రక్షిస్తుంది.నువ్వుల నూనెను కాస్త వేళ్లకు అద్దుకుని పెదాలకు రాసి, మృదువుగా మర్దన చేయండి. కాస్త జిడ్డుగా అనిపించినా కాసేపటికి పెదాలకు తగిన తేమ అంది సమస్య దూరమవుతుంది.