‎Winter Tips: చలికి చర్మం పగిలి ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి!

‎Winter Tips: చలికాలంలో పగిలిన చర్మంతో ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు చర్మాన్ని సంరక్షించుకోవచ్చు అని చెబుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Winter Skin

Winter Skin

Winter Tips: ‎ప్రస్తుతం చలికాలం అన్న విషయం మనందరికి తెలిసిందే. రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతూనే ఉంది. అయితే చలికాలం మొదలయింది అంటే చాలు సీజనల్ వ్యాధులతో పాటు, చర్మానికి సంబంధించిన సమస్యలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చర్మం పగలడం, పెదవులు పగలడం, కొన్ని కొన్ని సార్లు పెదవుల నుంచి రక్తస్రావం అవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే చలికాలం కారణంగా చర్మం పగిలితే కాస్త అందవిహీనంగా కనిపిస్తూ ఉంటారు. కాగా చలి కారణంగా మనం సహజంగా నీళ్లు కూడా తక్కువ తాగుతాం.

‎ అయితే ఇది చర్మ సమస్యలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. చలికాలం తగినంత నీటిని తాగడం, చర్మాన్ని కాపాడుకోవడానికి మాయిశ్చరైజర్లు ఉపయోగించటం మంచిదని చెబుతున్నారు. అదనంగా చలి నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి ఈ సీజన్ కి తగ్గట్టు బట్టలు కూడా వేసుకోవాలని చెబుతున్నారు. చలికాలం చల్లటి గాలులలో తేమ ఉండని కారణంగా ఇది మన చర్మం యొక్క సహజ నూనెను కోల్పోయేలా చేస్తుందట. అంతేకాదు దురదలకు అసౌకర్యానికి దారితీస్తుందని చెబుతున్నారు. అయితే చలికాలం చర్మాన్ని కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

‎ముఖ్యంగా చలికాలం సలసల మసలే నీటితో స్నానం చేయడం అస్సలు మంచిది కాదట. ఈ అలవాటు ఉంటే వెంటనే మార్చుకోవాలని చెపుతున్నారు. కేవలం గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే మంచిదని చెబుతున్నారు. చలికి తట్టుకోలేక ఇంట్లో హీటర్స్ పెట్టుకొని కూర్చునే వాళ్ళు చర్మం మరింత పొడిదనాన్ని చూడాల్సి వస్తుందని చెబుతున్నారు. గాలిలో తేమను పెంచే హ్యూమిడిఫైయర్‌ లను ఉపయోగించాలని చెబుతున్నారు. ఇది చర్మ హైడ్రేషన్‌ ను నిర్వహించడంలో దోహదం చేస్తుందట. చలికాలంలో పెదవులు పగలకుండా లిప్ బామ్‌ లను క్రమం తప్పకుండా ఉపయోగించడం కూడా మంచిదని చెబుతున్నారు. ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలతో ఇబ్బంది పడేవారు డెర్మటాలజిస్ట్ ను సంప్రదించటం మంచిదట. అంతేకాదు మెరుగైన హైడ్రేషన్ కోసం వైద్యులు సిఫార్సు చేసే క్రీములను ఉపయోగించాలని చెబుతున్నారు. చలికాలంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చర్మ ఆరోగ్యానికి మద్దతునిస్తుందని చెబుతున్నారు. చేపలు, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలని ప్రతిరోజు తగినంత నీటిని తాగాలని చెబుతున్నారు.

  Last Updated: 30 Nov 2025, 08:23 AM IST