Site icon HashtagU Telugu

Milk: పాలలో ఇది కలిపి రాస్తే చాలు ముడతలు మచ్చలు తొలగిపోవాల్సిందే?

Mixcollage 09 Feb 2024 05 10 Pm 9220

Mixcollage 09 Feb 2024 05 10 Pm 9220

పాల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పాలు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. పాలు ఉపయోగించి చర్మ సౌందర్యాన్ని ఈజీగా పెంచుకోవచ్చు. కేవలం పాలు మాత్రమే కాకుండా పాలలో కొన్ని రకాల పదార్థాలు కలిపి పూసుకోవడం వల్ల కూడా అందానికి సంబంధించిన సమస్యలను తొలగించుకోవచ్చు. రాత్రిపూట పడుకునేటప్పుడు కొద్దిగా పచ్చి పాలు తీసుకుని కాటన్ లాంటిది అందులో బాగా అద్ది ముఖానికి అప్లై చేసి ఉదయాన్నే శుభ్రం చేసుకుంటే చాలు మెరిసే చర్మం మీ సొంతం.

అలాగే ముఖ అందాన్ని పెంచేందుకు ముందుగా బాదంలను పాలలో వేసి నానబెట్టాలి. ఇవి నానిన తర్వాత చక్కని పేస్టులా చేయాలి. దీనిని ముఖానికి ప్యాక్‌లా వేసి ఆరిపోయాక స్క్రబ్ చేస్తూ గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి. దీని వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. వారానికి ఒకట్రెండు సార్లు ఇలా చేస్తే ఏయే లాభాలు ఉంటాయో తెలుసుకోవాలి. వయసు పెరిగే కొద్దీ చర్మంపై ముడతలు వస్తాయి. వీటన్నింటిని దూరం చేసి యవ్వనంగా కనిపించేలా చేయడంలో ఈ బాదం క్రీమ్ హెల్ప్ చేస్తుంది. బాదంలోని విటమిన్ ఇ చర్మంలోకి చొచ్చుకుపోయి వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది.

పాలు చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఇది చర్మంపై నేచురల్ స్క్రబ్‌లా పనిచేస్తుంది. పాలు, బాదంపప్పులని స్క్రబ్‌లా వాడవచ్చు. ఇది చర్మ కణాలకి హాని కలిగించకుండా స్క్రబ్బింగ్ గుణాలని అందిస్తుంది. దీని వల్ల చర్మం పొడిబారకుండు ఉంటుంది. దీని వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ఇది నేచురల్ ఫేస్‌ప్యాక్. స్కిన్ డ్రైగా మారకుండా చేస్తుంది. ఇందులో కొద్దిగా పసుపు, తేనె, అలొవెరా జెల్ కూడా వాడవచ్చు. ఇది మంచి టోనర్‌లా పని చేసి స్కిన్‌ని మెరిపిస్తుంది.

Exit mobile version