Mangoes:అతిగా మామిడిపండ్లు తింటున్నారా…ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు…!!

వేసవికాలం అనగా మామిడి పండ్లు గుర్తుకు వస్తాయి. ఈ సీజనంతా కూడ మామిడి పండ్లే ఉంటాయి. మామిడి పండ్లు ఇష్టపడనవారుండరేమో.

  • Written By:
  • Publish Date - May 24, 2022 / 03:13 PM IST

వేసవికాలం అనగా మామిడి పండ్లు గుర్తుకు వస్తాయి. ఈ సీజనంతా కూడ మామిడి పండ్లే ఉంటాయి. మామిడి పండ్లు ఇష్టపడనవారుండరేమో. వేసవి చివర్లో మామిడి పండ్ల దిగుమతి తగ్గిపోతుంది. ఇక మామిడి మళ్లీ కనిపించదంటూ…కొంతమంది తెగతినేస్తుంటారు. కానీ మామిడి విషయంలో అతి అనర్థాదాయకం అనే సామేత వర్తిస్తుంది.

మామిడిలో విటమిన్ A, B, C ,Kతోపాటుగా మినరల్స్ కాపర్, పొటాషియం, మెగ్నీషియం తగిన మోతాదులో ఉంటాయి. అంతేకాదు ఇందులో పీచు పదార్థం కూడా ఉంటుంది. ఇది పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాకు చాలా అవసరం. కానీ పరిమితికి మంది తింటే మాత్రం దుష్ప్రభావాలు కూడా ఎక్కువగానే ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. కొంతమంది మందికి మామిడి పండ్లు పడవు. అలాంటివారిలో ఒక్క పండుతో అయినా ఈ అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

అలర్జీ:
మామిడిలో ఉండే ప్రొటీన్లు కొందరికి పడవు. చర్మంపై దురదలు, దద్దుర్లు, గొంతులో వాపు, శ్వాసతీసుకోవడం వంటివి కనిపిస్తే మామిడి పండ్లను తినడం మానేయ్యాలి.

రక్తంలో గ్లూకోజు స్థాయి పెరుగుతుంది:
షుగర్ ఉన్న వారు రక్తంలో గ్లూకోజు పరిమితి దాటిపోకుండా చూసుకోవాలి. అందుకని షుగర్ సమస్యతో బాధపడేవారు రోజులో ఒక పండును మించి తినకూడదు. ఇందులో కార్బొహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. చక్కెరలు కూడా అధికంగా ఉంటాయి…ఎక్కువగా తిన్నట్లయితే రక్తంలో గ్లూకోజు గణనీయంగా పెరుగుతుంది.

డయేరియా:
మామిడి పండ్లను ఎక్కువగా తింటే సాధారణ రోజులతో పోలిస్తే…ఒకటి రెండు సార్లు అదనంగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చిందంటే అది కచ్చితంగా మామిడి దోషమే అని భావించాలి. అంతేకాదు కొందరు ఒక పండు తిన్నా నీళ్ల విరేచనాలు అవుతుంటాయి. అలాంటివారు తినకుండా ఉండటమే మంచిది.

బరువు:
ఒకటికి మంచి మామిడి పండ్లను తింటే బరువుకు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఒక మామిడి పండుతో సుమారు 201కేలరీలు వస్తాయి.

కృత్రిమంగా పండించినవి మంచివి:
మామిడి పండ్లను హానికారక రసాయనాలతో మగ్గిస్తున్నారు. వీటిని తింటే కొందరిలో అలెర్జీలు, ఇతర దుష్ర్పభావాలు కనిపిస్తాయి.ఒక బకెట్లో నీటిని పోసి మామిడి పండును అందులో వేయండి. మునిగితే అది సహజసిద్ధంగా పండినట్లు. పైన తేలినట్లయితే అది క్రుత్రిమంగా పండినట్లు అర్థం చేసుకోవాలి.