Jaggery: బెల్లం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తరచుగా తీసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చలికాలంలో బెల్లం తినాల్సిన అవసరం ఉంది. చిన్న బెల్లం ముక్కతో అనేక లాభాలు కలుగుతాయి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తరచుగా జలుబుతో బాధపడుతున్న వారు ప్రతిరోజూ చిన్న బెల్లం ముక్క తింటే మంచిదట.
ముఖ్యంగా చలికాలంలో బెల్లం తినడం వల్ల అది మీ శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుతుందని, అలాగే ఇది చలికాలపు వ్యాధులను రాకుండా అడ్డుకోవడంలో కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. బెల్లంలో ఐరన్ తో పాటు వివిధ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయట. అందుకే రక్తహీనతతో బాధపడేవారు ప్రతిరోజూ బెల్లం ముక్క తినాల్సిందే అని చెబుతున్నారు. రోజూ దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ఉత్పత్తి మెరుగుపడుతుందట. రక్తహీనత సమస్య రాకుండా ఉంటుందని చెబుతున్నారు. చలికాలంలో ఎక్కువగా భోజనాలు తిన్నాక కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఈ సమస్యతో బాధపడే వారు భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తినాలట.
రోజూ బెల్లం తినడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుందని, గ్యాస్, మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. కాగా చలికాలంలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బెల్లం తినాల్సిందే. బెల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు మనకు చాలా అవసరం. బెల్లం తినడం వల్ల మీ రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందట. ఇది అనారోగ్యం బారిన పడే అవకాశాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. రోజూ బెల్లం తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, రక్తం కూడా శుద్ధి అవుతుందట. మహిళల్లో మొటిమలు రాకుండా ఉంటాయని, మీ చర్మం మెరుస్తుందని,జుట్టు బలపడుతుందని చెబుతున్నారు. అందుకే పోషకాల కోసం చక్కెర బదులు బెల్లం వాడటం ఆరోగ్యానికి చాలా మంచిదట.
Jaggery: చలికాలంలో రోజు ఒక చిన్న బెల్లం ముక్క తింటే ఏమవుతుందో మీకు తెలుసా?

Jaggery