Site icon HashtagU Telugu

Curd With Sugar: పెరుగులో చక్కెర కలుపుకొని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Curd With Sugar

Curd With Sugar

పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది అన్న విషయం మన అందరికీ తెలిసిందే. పెరుగు ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చడంతోపాటు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. పెరుగులో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది అన్న విషయం తెలిసిందే. పెరుగులో ఉండే క్యాల్షియం ఎముకలను బలంగా చేస్తుంది. అలాగే పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా పేగులను హెల్తీగా ఉంచడంలో బాగా సహాయపడతాయి. ఒకవేళ పెరుగులో చక్కెరని కలుపుకొని తింటే ఎన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి, అలాగే ఎన్ని రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పెరుగును తినడం వల్ల శారీరక ఆరోగ్యం బాగుండడంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. పెరుగు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. పెరుగులో చక్కెరను కలుపుకొని తినడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు పుష్కలంగా ఉంటాయి. మరి ముఖ్యంగా ఎండాకాలంలో పెరుగు తినడం వల్ల హైడ్రేటెడ్ గా ఉండడంతో పాటు ఎనర్జిటిక్ గా కూడా ఉండవచ్చు. పెరుగులో చక్కెరను కలుపుకుని తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగడం మాత్రమే కాకుండా జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో పంచదార పెరుగును కలిపి తినడం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉండడంతో పాటు చల్లగా ఉంటుంది.

పెరుగును ఉదయం పూట తినడం వల్ల ఎసిడిటీ కడుపులో చికాకు మంట లాంటి సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాకుండా పెరుగు మన శరీరంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. పెరుగు పంచదార మిశ్రమం మెమొరీ పవర్ ని కూడా పెంచుతుంది. పెరుగు చక్కెర కలుపుకొని తినడం వల్ల అలసట, ఒత్తిడి వంటి సమస్యలను కూడా తగ్గుముఖం పడతాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడేవారికి చక్కెర కలిపిన పెరుగు ఒక ఔషదంలా పనిచేస్తుంది. కాబట్టి దీనిని తరచుగా తినడం వల్ల గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్య తొందరగా తగ్గుతుంది. అదేవిధంగా గుండె సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి.