Site icon HashtagU Telugu

Skin Care: ఇవి తింటే ముడతలు ఉండవు.. వయసొచ్చిన అందం తగ్గదు!

Skin Aging

Skin Aging

Skin Care: అమ్మాయిలు, అబ్బాయిలు అందం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. చర్మం పై ఉండే మొటిమలు, నల్లని మచ్చలు, అలాగే ముడతలును పోగొట్టుకోవడానికి మార్కెట్లో దొరికి అనేక రకాల ఫేస్ క్రీమ్, జెల్స్ ను వాడుతూ ఉంటారు. అయినప్పటికీ కొంతమందికి చర్మం పై ఉండే సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. అయితే మార్కెట్లో దొరికే వివిధ రకాల మేకప్ ప్రొడక్షన్ వాడటం వల్ల కూడా ముఖంపై ముడతలు రావడం మొటిమలు ఏర్పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. మరి చర్మంపై ఉండే ముడతలు పోవాలి అంటే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అయితే చర్మంపై ఉండే ముడతలు మొటిమలను కవర్ చేయడానికి కొంతమంది ఓవర్ గా మేకప్ వేస్తూ ఉంటారు. అయితే ఆ మేకప్ లు కొద్దిసేపు మాత్రమే కనిపించకుండా చేస్తాయి. మేకప్ వేపుకున్న ముడతలు మటుమాయం అవ్వాలి అంటే ఈ ఆహార పదార్థాలను తినాల్సిందే. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఆకుకూరలు తినడం వల్ల చర్మంపై ఉండే ముడతలు తగ్గిపోతాయి. బచ్చలి కూర, టమాటో, ఆరెంజ్ వంటివి తినడం వల్ల ఉండే ముడతలు తగ్గిపోతాయి. కొల్లాజెన్ ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కొల్లా జెన్ అనే పదార్థం ఎక్కువగా మాంసకృతుల్లో ఉంటుంది.

అలాగే విటమిన్ ఎ, విటమిన్ ఈ, విటమిన్ డి, విటమిన్ కె లు చర్మ సౌందర్యానికి బాగా అవసరం. అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకుంటే ఎటువంటి చర్మ సమస్యలు కూడా రావు. ఇందుకోసం ఆలివ్ ఆయిల్, అవకాడో, సాల్మాన్, నెయ్యి, వాల్ నట్స్, అవిసె గింజలను రోజు వారి ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే బెర్రీలను తినడం వల్ల చర్మం పై ముడతలు ఎక్కువగా రావు. డ్రై స్కిన్ ఉన్నవారు ప్రతిరోజు బెర్రీలను తినడం వల్ల చర్మం తేమగా మారుతుంది. అదేవిధంగా కలబంద చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. కలబంద గుజ్జును ముఖానికి అప్లై చేయడం వల్ల కొల్లాజెన్ ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుంది. అంతేకాదు కలబంద చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ముడతలను నివారిస్తుంది. అలాగే మొటిమలు నల్ల మచ్చలు లాంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.

Exit mobile version