Teeth: తళతళ మెరిసే పళ్లకోసం ఈ ఆహారాలను తినండి..!

ఉదయం, సాయంత్రం బ్రష్‌ చేసుకోవడం, ఫ్లాసింగ్‌, ఆయిల్‌ పుల్లింగ్‌తో మీ పళ్లను, నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మన డైట్‌లో కొన్ని రకాల ఆహరపదార్థాలు చేర్చుకున్నా..

ఆరోగ్యకరమైన శరీరంలానే.. ఆరోగ్యకరమైన పళ్లు (Teeth), నోరు కూడా చాలా ముఖ్యం. మనలో చాలా మంది నోటి ఆరోగ్యంపై అంతగా శ్రద్ధ చూపరు. ఉదయం నిద్ర లేచాక పళ్లు తోముకొని మమా అనిపించేస్తారు. పంటి నొప్పి, పంటి సమస్యలు వస్తేనే దానిని పట్టించుకుంటారు. దంతాలు, నోటి ఆరోగ్యాన్ని విస్మరిస్తే.. నోటిలో బ్యాక్టీరియా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. నోటి నుంచి దుర్వాసన, పళ్లు పసుపుగా మారతాయి. దీంతో నవ్వాలన్నా, దగ్గరకు వెళ్లి ఎవరితోనైనా మాట్లాడాలన్నా నామోషీగా అనిపిస్తుంది. నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే.. పుచ్చిపోయిన పళ్లు, చిగుళ్లు వాయటం, చిగుళ్ల నుంచి రక్తస్రావం వంటి సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. స్వీట్స్‌ ఎక్కువగా తింటున్నా, స్మోకింగ్, ఆల్కహాల్‌, కాఫీ/టీ వంటి అలవాట్ల కారణంగా పళ్లు (Teeth) పసుపు పచ్చగా మారే అవకాశం ఉంది. ఉదయం, సాయంత్రం బ్రష్‌ చేసుకోవడం, ఫ్లాసింగ్‌, ఆయిల్‌ పుల్లింగ్‌తో మీ పళ్లను, నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మన డైట్‌లో కొన్ని రకాల ఆహరపదార్థాలు చేర్చుకున్నా.. పుసుపు పచ్చగా మారిన పళ్లు తిరిగి.. తెల్లగా మెరిసిపోతాయి.

యాపిల్‌:

NCBI నివేదిక ప్రకారం, ఆపిల్ (Apple) తినడం వల్ల దంతాలు శుభ్రపడతాయి. నోటి దుర్వాసన నుంచి ఉపశమనం లభిస్తుంది. యాపిల్‌లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది.. ఇది టూత్‌ బ్రష్‌గా పని చేస్తుంది. దంతాల నుంచి ఫలకాన్ని తొలగిస్తుంది. యాపిల్‌లో ఉండే యాసిడిక్‌ గుణం నోటి దుర్వాసనకు కారణమయ్యే చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. దీనిలో పొటాషియం,మెగ్నీషియం ఉన్నాయి. ఇవి చెడు బ్యాక్టీరియాను చంపి, పళ్లపై పేరుకున్న పాచిని తొలగిస్తాయి.

క్యారెట్‌:

క్యారెట్‌ (Carrot) లోనూ ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. క్యారెట్‌ రోజూ తినడం వల్ల దంతాల మీద పేరుకున్న ఫలకం తొలగుతుంది. ఇది పళ్లకు మంచి మెరుపును ఇస్తుంది. క్యారెట్ తినడం వల్ల.. లాలాజలం ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఇది దంతాలను సహజంగా శుభ్రపరుస్తుంది. క్యారెట్‌‌‌‌‌లో విటమిన్‌ బి.. పుష్కలంగా ఉంటుంది. ఇది చిగుళ్ల వాపుతో పోరాడుతుంది.

స్ట్రాబెర్రీ:

స్ట్రాబెర్రీ (Strawberry) లలో మాలిక్ యాసిడ్‌ అధికంగా ఉంటుందని NIH నిర్వహించిన అధ్యయనంలో కనుగొన్నారు. మాలిక్‌ యాసిడ్‌ను టూత్‌ పేస్ట్‌ తయారీలోనూ వాడతారు. ఇది న్యాచురల్‌ రక్తస్రావ నివారిణిగా పనిచేస్తుంది, దంతాల మూలల్లో ఫలకాన్ని తొలగిస్తుంది. దీనిలో ఉండే సిట్రిక్‌ యాసిడ్‌ దంతాలను తెలుపు రంగులోకి మారుస్తుంది.

పుచ్చకాయ:

స్ట్రాబెర్రీలతో పోలిస్తే.. పుచ్చకాయ (Watermelon) లో మాలిక్ యాసిడ్ పరిమాణం ఇంకా ఎక్కువగా ఉంటుంది. మాలిక్ యాసిడ్ మీ దంతాలను తెల్లగా మార్చడంలో, లాలాజల ఉత్పత్తిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. పుచ్చకాయలో ఉండే.. ఫైబర్‌ మీ దంతాలను స్క్రబ్‌ చేస్తుంది. దంతాలపై ఉన్న మరకలను తొలగిస్తుంది.

ఉల్లిపాయ:

ఉల్లిపాయ (Onion) లో శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి దంత క్షయానికి కారణమయ్యే నోటి బ్యాక్టీరియాన్ని నాశనం చేస్తాయి. సలాడ్‌ రూపంలో ఉల్లిపాయ తీసుకుంటే.. నోటి ఆరోగ్యానికి మంచిది.

Also Read:  Snoring Problem: గురక సమస్యకు ఈ చిట్కాలు పాటించండి..