మీరు బరువు పెరగాలనుకుంటున్నారా? (Weight gain tips)అవును మేము అడిగిన ప్రశ్న అదే. ఈ మధ్యకాలంలో అధిక బరువుతో బాధపడేవారిని చూస్తున్నాం. కానీ సన్నగా ఉన్నవాళ్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బరువు పెరగాలని కోరుకుంటారు. మీరు కూడా బరువు పెరగాలనుకుంటే, అరటిపండ్లను ఆహారంలో చేర్చుకోండి. అరటిపండు మిమ్మల్ని అనేక వ్యాధుల నుండి కాపాడుతుంది. సన్నని శరీరాన్ని ధ్రుడంగా మారుస్తుంది. అరటిపండ్లలో విటమిన్లు, పోషకాలెన్నో ఉన్నాయి.
అరటిపండు ఆరోగ్యానికి మేలు చేస్తుంది:
అరటిపండులో ఉండే పోషకాల గురించి మాట్లాడినట్లయితే, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు A, C, B-6, ఇనుము, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం, జింక్, సోడియం, పొటాషియం ఇందులో ఉన్నాయి, ఇవి శరీరానికి తగిన ప్రోటీన్, పోషణను అందిస్తాయి. . అదనంగా, సుక్రోజ్, ఫ్రక్టోజ్ ,గ్లూకోజ్ వంటి సహజ చక్కెరలను అందిస్తుంది.
బరువు పెరగడం ఎలా:
మీరు బరువు పెరగాలనుకుంటే, అధిక కేలరీల ఆహారాలను ఆహారంలో చేర్చుకోవాలని డైట్ నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇది కాకుండా, ప్రోటీన్ రిచ్, పాల ఉత్పత్తులు, స్టార్చ్ ఉత్పత్తులను తినడం ప్రారంభించండి. బరువు పెరగాలంటే నిపుణుల సలహా మేరకు కొన్ని ప్రత్యేక బరువు పెరిగే వ్యాయామాలు చేయాలి.
బరువు పెరగాలంటే ఇలా అరటిపండ్లు తినండి:
పాలతో:
పాలు-అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీరు ఖాళీ కడుపుతో పాలు-అరటిపండు తినాలి. ఎందుకంటే అరటిపండులో చాలా కేలరీలు ఉంటాయి, ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా బరువును పెంచడంలో సహాయపడతాయి.
నెయ్యి-అరటిపండు:
అరటిపండును నెయ్యి కలిపి తింటే బరువు పెరుగుతారు. మీరు 2 అరటిపండ్లను బాగా మెత్తగా చేసి, దానికి 1 టీస్పూన్ దేశీ నెయ్యి కలపండి. ప్రతిరోజూ ఉదయం అల్పాహారంలో చేర్చండి. ఇవి కేలరీలు, కొవ్వును కలిపి బరువు పెరగడానికి సహాయపడతాయి.
ఓట్స్:
ఓట్స్- అరటిపండు కూడా బరువు పెరగడానికి సహాయపడుతుంది. దీని కోసం మీరు మొదట పాలలో ఓట్స్ ను ఉడికించాలి. తర్వాత దానికి నెయ్యి వేయాలి. దీని తర్వాత అరటిపండు ముక్కలను వేయాలి. మూడింటిని మిక్స్ చేసి తినాలి. ఇలా చేయడం వల్ల బరువు పెరగడానికి చాలా సహాయపడుతుంది.