ప్రస్తుత రోజుల్లో చిన్న వయసు వారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. 11 ఏళ్ల పిల్లల నుంచే ఈ సమస్య మొదలవుతోంది. తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడం కోసం రకరకాల హెయిర్ ఆయిల్స్ హెయిర్ కలర్స్ ఉపయోగించడంతోపాటు ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. చిన్న వయసు నుంచే జుట్టుకు రంగు వేయడం మొదలు పెట్టడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. దీనివల్ల అనేక రకాల సమస్యలు వస్తాయట. తెల్ల జుట్టు రావడానికి అసలు కారణం శరీరానికి కావాల్సిన పోషకాలు అందకపోవడమే అని చెబుతున్నారు.
వాటితో పాటు హెయిర్ కోసం మార్కెట్లో లభించే రకరకాల కెమికల్ బ్యూటీ ప్రోడక్ట్లు కూడా కారణం అంటున్నారు. అయితే ఈ సమస్యలు ఉండకూడదు అంటే నాలుగు ఫుడ్స్ ని రాత్రి పడుకునే ముందు నెయ్యితో కలిపి తినాలి. ఇంతకీ ఆ నాలుగు పదార్థాలు ఏంటి అన్న విషయానికి వస్తే.. ఉసిరి, కరివేపాకు, భృంగరాజ్, బ్రహ్మీలను నెయ్యిలో కలిపి తీసుకోవాలట. రాత్రి పడుకునే ముందు లేదంటే ఉదయాన్నే పరగడుపున తినాలని చెబుతున్నారు. కాగా ఉసిరికాయలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది జుట్టు మూలాలకు పోషణనిస్తుందట. అలాగే ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుందట.
బూడిద రంగులోకి మారకుండా చేస్తుందని, ఉసిరిలో ఉండే పోషకాలు జుట్టు, చర్మానికి చాలా మేలు చేస్తాయని చెబుతున్నారు. అదేవిధంగా బృంగరాజ్‌లో ఐరన్, విటమిన్ ఇ, విటమిన్ డి, మెగ్నీషియం, కాల్షియం, యాంటీ బాక్టీరియల్ , యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి జుట్టు అకాల నెరసిపోవడాన్ని నివారీస్తాయట. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుందని, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ,మినరల్స్ సమృద్ధిగా ఉండే బ్రహ్మి జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుందని, బ్రహ్మి స్కాల్ప్‌ను రిలాక్స్ చేస్తుందని ఒత్తిడిని కూడా తగ్గిస్తుందనిక్ ఇది జుట్టు రాలడానికి ప్రధాన కారణం అని చెబుతున్నారు.. కరివేపాకులో కూడా ప్రొటీన్లు, విటమిన్ బి6, బీటా కెరోటిన్ ఉంటాయి. ఇది జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుందట. ఇది జుట్టు మూలాలకు పోషణనిస్తుందట. చుండ్రుని తగ్గించి జుట్టు బూడిద రంగులోకి మారకుండా చేస్తుందని చెబుతున్నారు. కాబట్టి వీటన్నింటినీ పొడి చేసుకుని నెయ్యితో కలిపి తినడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయట. తినడం మొదలుపెట్టిన 10 నుంచి 15 రోజులకే ఫలితాలు కనిపించడం మొదలుపెడతాయని చెబుతున్నారు.