ప్రస్తుత రోజుల్లో చాలా మంది డార్క్ సర్కిల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ డార్క్ సర్కిల్స్ రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. గంటల తరబడి మొబైల్ ఫోన్లు, లాప్టాప్ లు,టీవీలు చూడటం వల్ల కూడా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి. ఈ డార్క్ సర్కిల్స్ ని తగ్గించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కొన్ని కొన్ని సార్లు మంచి ఫలితాలు కనిపించవు. మరి డార్క్ సర్కిల్స్ దూరం అవ్వాలంటే అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కళ్ళ కింద ఏర్పడే నల్లటి వలయాలోకి టమాట ఎంతో మంచిది టమోటాలు చర్మంపై మచ్చలను తొలగించి మెరిసేందుకు తోడ్పడుతాయని చెబుతున్నారు. ఒక టీ స్పూన్ టమాటా జ్యూస్ కి నిమ్మరసం కలిపి కళ్ళ కింద రాసుకోవాలట.
పది నిమిషాల తర్వాత చల్ల నీటితో కడిగేసుకోవాలని, రోజుకి రెండుసార్లు ఇలా చేయడం వలన మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. అదేవిధంగా బంగాళదుంప ని మెత్తని జ్యూస్ గా చేసి అందులో ముంచిన కాటన్ బాల్స్ ని కళ్ళ మీద ఉంచుకోవాలట. ఇలా చేయడం వలన కళ్ళ కింద నల్ల మచ్చలు తగ్గడమే కాకుండా కళ్ళని మెరిసే లాగా చేస్తుందని చెబుతున్నారు. అలాగే గ్రీన్ టీ బ్యాగ్ కూడా బ్లాక్ సర్కిల్స్ కి మంచి రెమిడీ ముందుగా గ్రీన్ టీ బ్యాగ్ ని నీటిలో ముంచి కాసేపు ఫ్రిజ్ లో ఉంచాలి. తర్వాత దాన్ని కళ్ళపై ఉంచుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయట.
అలాగే కీరదోషని గుండ్రటి మొక్కలుగా తరిగి కళ్ళపై ఉంచుకోవడం వలన నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయట. రోజ్ వాటర్ చర్మానికి పునరుత్తేజాన్ని ఇస్తుంది దూదిని రోజు వాటర్లో ముంచి డాక్టర్ సర్కిల్స్ పై ఉంచాలి. 15 నిమిషాలు ఆగాక చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే డార్క్ సర్కిల్స్ సమస్యలు ఉండవు. నెలరోజుల పాటు ప్రతి రాత్రి ఇలా చేయడం వలన మెరుగైన ఫలితాలు ఉంటాయట.