Site icon HashtagU Telugu

Grey Hair : తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఆ ఆముదంలో ఇవి కలిపి రాయాల్సిందే ?

Mixcollage 24 Jan 2024 02 40 Pm 9563

Mixcollage 24 Jan 2024 02 40 Pm 9563

ఈ రోజులో 15 ఏళ్ల వయసు పిల్లల నుంచి ముసలి వారి వరకు చాలామంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా ఈ తెల్ల జుట్టు సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. చిన్న ఏజ్ లోనే వయసుకు ఉన్న వారిలా కనిపించడంతోపాటు నలుగురిలోకి వెళ్లాలి అన్న కూడా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ రోజుల్లో యువత ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. తెల్ల వెంట్రుకలు నల్లగా మార్చుకోవడం కోసం చిన్న వయసులోనే రకరకాల హెయిర్ కలర్స్ ని ఉపయోగిస్తున్నారు. అయితే మీరు కూడా అలా తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా.

ఇకమీదట తెల్ల జుట్టు సమస్యలతో బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆముదంలో కొన్ని రకాల ఆయిల్స్ కలిపి రాస్తే చాలు తెల్ల జుట్టు నల్లగా మారడంతో పాటు ఒత్తుగా కూడా పెరుగుతుంది. మరి ఆముదంతో తెల్ల జుట్టును నల్లగా ఎలా మార్చుకోవాలి అన్న విషయాన్ని వస్తే.. జుట్టు బలంగా పెరగడంలో ఆముదం కీ రోల్ పోషిస్తుంది. ఈ ఆయిల్‌‌తో ఈ కొరియల్ ఆయిల్ వాడొచ్చు. ఇది జుట్టుని దృఢంగా చేస్తుంది. ఇది జుట్టు పెరుగుదలని పెంచుతుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి మాయిశ్చరైజ్ చేస్తుంది. బాదం నూనె జుట్టు పెరుగుదలకి చాలా మంచిది. దీనిని వాడడం వల్ల జుట్టు ఒత్తుగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. వీటితో పాటు ఆర్గాన్, కామెల్లియా నూనె కూడా హెల్ప్ చేస్తుంది.

ఈ నాలుగు జుట్టుని దృఢంగా, నల్లగా చేస్తుంది. ముందుగా బాదం నూనె, బాదం నూనె, కామెల్లియా, ఆర్గాన్ ఆయిల్‌ని సమాన పరిమాణంలో తీసుకోవాలి. మీకు ఇష్టమనుకుంటే కొద్దిగా లావెండర్ ఆయిల్ కూడా కలపొచ్చు. వీటన్నింటి గాజు సీసాలో వేసి ఎండ తగలని చోట పెట్టాలి. ఈ ఆయిల్‌ని కొద్దిగా తీసుకుని మీ చేతితో జుట్టుకి, కుదుళ్ళకి బాగా మసాజ్ చేయండి. ఓవర్ నైట్ అలానే ఉంచండి. లేదా 30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. తర్వాత కండీషనర్ అప్లై చేయవచ్చు. దీనిని రెగ్యులర్‌గా అప్లై చేస్తే జుట్టు మంచి రంగులో ఉంటుంది.