Site icon HashtagU Telugu

Hair Growing Tips: జుట్టు నల్లగా, ఒత్తుగా పెరగాలి అంటే.. అయితే ఇలా చేయాల్సిందే?

Hair Growing Tips

Hair Growing Tips

ప్రస్తుత రోజుల్లో ఒత్తిడి, కాలుష్యం, బ్యూటీ ప్రొడక్ట్స్ , అలాగే ఇతర కారణాల వల్ల జుట్టు రాలిపోవడం అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. స్త్రీ పురుషులు ఇద్దరు ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. ముఖ్యంగా స్త్రీలు హెయిర్ ఫాల్ ను తగ్గించుకొని జుట్టు నల్లగా ఒత్తుగా పెరగడం కోసం అనేక రకాల చిట్కాలను పాటిస్తూ ఉంటారు. అలాగే మార్కెట్ లో దొరికే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ని, హోమ్ రెమిడీస్ ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయితే జుట్టు ఒత్తుగా, నల్లగా పెరగాలి అంటే ఇంకా ఏ చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం… కొందరు మహిళలు జడ వేసుకునే సమయంలో జట్టును బలంగా లాగి టైటుగా జడ వేస్తుంటారు.

ప్రతిరోజూ ఇలా చేయడం ట్రాక్షన్ అలోసేపియాకు దారి తీస్తుంది. ట్రాక్షన్ అలోపేసియా అనేది జుట్టును చాలా కాలం పాటు ఒకే విధంగా లాగడం వల్ల జుట్టు రాలితుందని వారు తెలిపారు. జుట్టుపై పదేపదే ఒత్తిడి చేయడం వల్ల కుదుళ్లు దెబ్బతింటాయి. దీని వల్ల ముఖ్యంగా నుదురు మీద వెంట్రుకలు ఊడిపోతాయని వివరించారు. అందువల్ల జుట్టు దువ్వుకునే సమయంలో వదులుగా ఉండే విధంగా జడలను వేసుకోవాలని, తరచుగా మీ కేశాలంకరణను మార్చుకోవాలి. రోజుకు 100 సార్లు జుట్టును దువ్వుకుంటే మీ జుట్టు మెరిసేలా, ఆరోగ్యంగా ఉంటుందని పాతరోజుల్లో మన పెద్దవాళ్లు చెప్పేవారు. కానీ అది అసత్యం దువ్వుకోవడం అనేది హెయిర్ కేర్‌లో ఒక ముఖ్యమైన భాగం. అయితే కఠినమైన, ఓవర్ బ్రషింగ్ మీ మాడుపై ప్రభావం చూపడమే కాకుండా జుట్టు రాలిపోవడానికి దారితీస్తుంది.

పాత రోజుల్లో మనుషులు చాలా ఆనందంగా, ప్రశాంతంగా జీవితాన్ని గడిపేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఉదయం లేచినప్పటి నుంచి చాలా తక్కువ సమయంలో మనం ఎన్నో పనులు చేయాల్సి వస్తుంది. ఎన్నో విషయాలు చూసుకోవాల్సి వస్తోంది. దానివలన మన జీవనశైలి చాలా హడావిడిగా మారుతుంది. ఇది ప్రధానంగా మనలో ఒత్తిడిని కలుగజేస్తుంది. మనం ఎక్కువగా ఒత్తిడికి లోనైతే జుట్టు ఊడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం తినే ఆహారంలో కావాల్సిన పోషకాలు లేకపోతే జుట్టు ఊడటం మొదలవుతుంది. మన శరీరానికి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ సమపాళ్ళలో కావాలి. మనం రోజూ తినే ఆహారంలో ఎక్కువగా జంక్ ఫుడ్, ప్యాకేజ్ ఫుడ్ తో నిండి ఉంటే మనలో పోషకాహార లోపం వస్తుంది. ఇలాంటి ఆహారం వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోయే అవకాశం ఉంటుంది.

నిద్ర మన శరీరానికి కనీస అవసరం. ఆరోగ్యకరమైన జుట్టు కి సరైన నిద్ర చాలా ముఖ్యం. కనీసం రోజుకి 8 గంటలు నిద్ర పోవాలి. కావలసినంత నిద్ర లేకపోతే లేదా పడుకున్నా సరిగా నిద్ర పట్టకపోయినా జుట్టు ఊడిపోతుంది. ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులు వాడటం, సోషల్ మీడియాలో ఎక్కువ గడపడం, లేట్ నైట్ పార్టీ లకి వెళ్లడం ఇలాంటి అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల నిద్ర దూరమవుతుంది. దీనివల్ల జుట్టు ఊడిపోయి అవకాశం పెరుగుతుంది. అంతేకాకుండా ఇన్సోమ్నియా వచ్చే ప్రమాదం కూడా ఉంది. అలాగే రకరకాల హెయిర్ స్టైల్స్ ని ఫాలో అవ్వడం అన్నది మానేయాలి.

మనం వాడే చాలా వరకు షాంపూలు, జెల్స్, హెయిర్ కండిషనర్స్, హెయిర్ స్ప్రే లు మొదలైన వాటిలో హానికర రసాయనాలు ఉంటాయి. ఇవి మన జుట్టుకి చాలా నష్టం కలిగిస్తాయి. అవి జుట్టుకే కాదు మన శరీరానికి కూడా మంచిది కాదు. కొన్నిసార్లు అవి మంచి ఫలితాలు ఇవ్వవచ్చు. కానీ దీర్ఘకాలంలో జుట్టు ఊడిపోవడానికి కారణం అవుతుంది. జుట్టు విషయంలో శుభ్రత పాటించకపోతే జుట్టు ఊడిపోతుంది. తరచూ జుట్టుని శుభ్రం చేయకపోవడం, దువ్వెనను శుభ్రం చేయకపోవడం, సెలూన్ లేదా బ్యూటీ పార్లర్‌లో వేరే వాళ్ళు వాడిన దువ్వెన వాడడం ద్వారా జుట్టు కలుషితమై ఎక్కువగా రాలిపోవడానికి కారణమవుతుంది.