Site icon HashtagU Telugu

Heavy Bleeding : పీరియడ్స్ సమయంలో రక్తస్రావం అధికంగా ఉంటోందా ? ఈ చిట్కాలతో కంట్రోల్ చేయండి

heavy bleeding controlling remedies

heavy bleeding controlling remedies

Heavy Bleeding Controlling Remedies : పీరియడ్స్.. ఈడొచ్చిన ప్రతీ ఆడపిల్లకు రుతుక్రమం వస్తుంది. కొందరికి పీరియడ్స్ సమయంలో విపరీతమైన కడుపునొప్పి, నడుమునొప్పితో పాటు కాళ్లనొప్పులు, ఒళ్లునొప్పులు కూడా వస్తాయి. పీరియడ్స్ సమయంలో ఏ ఆడపిల్లకైనా, మహిళలకైనా అసహనంగా ఉంటుంది. చిన్నచిన్న కారణాలకే విసిగిపోతుంటారు. కొందరికి అధిక రక్తస్రావం అవుతుంటుంది. ఫలితంగా రక్తహీనత బారిన పడతారు. అధిక రక్తస్రావాన్ని నేచురల్ గా తగ్గించుకునేందుకు కొన్ని ఇంటిచిట్కాలున్నాయి. వాటిని ఒకసారి ట్రై చేసి చూడండి.

అధిక రక్తస్రావం వల్ల ఐరన్ లోపం వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఆప్రికాట్, ఎండుద్రాక్ష, గుడ్లు, ఉడికించిన పాలకూర, డ్రైఫ్రూట్స్, బ్రోకరీ, టోఫు, బీన్స్, కోడిగుడ్లను తరచూ తింటూ ఉండాలి.

కొన్నిరకాల పానీయాలను చేసుకుని తాగడం ద్వారా కూడా ఈ సమస్యనుంచి బయటపడొచ్చు. అల్లం ముక్కను తురిమి 5-10 నిమిషాలపాటు నీటిలో ఉడికించుకుని అల్లం టీ తయారు చేసుకోవాలి. పీరియడ్స్ సమయంలో రోజుకు 2-3 సార్లు తాగితే.. అధిక రక్తస్రావంతో పాటు నొప్పి నుంచి రిలీఫ్ ఉంటుంది. అలాగే.. ఒక స్పూన్ తేనెలో చిటికెడు కుంకుమపువ్వును కలిపి తినొచ్చు.

దాల్చిన చెక్క, ధనియాలలో 1 కప్పు నీరు పోసి అరకప్పు అయ్యేవరకూ మరిగించుకోవాలి. అందులో కొద్దిగా పంచదారను కలిపి రోజుకు 2 సార్లు తీసుకుంటే చాలు.

2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ ను నీటలో కలిపి రోజుకు 2-3 సార్లు తాగితే.. అధికరక్తస్రావం నుంచి రిలీఫ్ దక్కుతుంది. కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.

మీకు నిద్ర తక్కువగా ఉన్నా రక్తస్రావం ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు పీరియడ్స్ సమయంలో సరిగ్గా నిద్రపోవాలి. హార్మోన్ల స్థాయులు నియంత్రణలోకి రావడం వల్ల బ్లీడింగ్ తగ్గుతుంది. ఫలితంగా అలసట, నొప్పి కూడా తెలియవు.