Dry Mouth: పదే పదే నోరు పొడిబారుతోందా.. అయితే ఈ రోగాల బారిన పడినట్టే?

సాధారణంగా వేసవికాలంలో తరచుగా దాహం వేయడంతో పాటు నోరు పొడిబారుతూ ఉంటుంది. అంతేకాకుండా బాడీ

  • Written By:
  • Publish Date - December 1, 2022 / 07:30 AM IST

సాధారణంగా వేసవికాలంలో తరచుగా దాహం వేయడంతో పాటు నోరు పొడిబారుతూ ఉంటుంది. అంతేకాకుండా బాడీ కూడా డీ హైడ్రెట్ అవుతూ ఉంటుంది. అటువంటి సమయంలో చాలామంది చల్లగా ఉండటం కోసం ఫ్రిజ్లో నీళ్లు తాగుతూ ఉంటారు. కానీ ఫ్రిజ్లో నీళ్ల కంటే కుండలో నీళ్లు ఎంతో మంచిది. కుండలో నీరు తాగినప్పటికీ నోరు పదేపదే పొడిబారుతుంటే, ఇన్ని నీళ్లు తాగినా కూడా పదేపదే దాహం వేస్తె అది పలు రకాల అనారోగ్య సమస్యకు కారణం కావచ్చు. నీరు ఎక్కువగా తాగకపోయినా కూడా నోరు పొడిబారుతూ ఉంటుంది. ఒకవేళ నీరు తగినన్ని తాగినా కూడా నోరు పొడిబారుతున్నట్లు అయితే మీకు ఆరు రకాల వ్యాధులు సోకి ఉండవచ్చు. మరి ఆ ఆరు రకాల వ్యాధులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అయితే మన శరీరంలోని ప్రతి అవయవం అంతర్గతంగా ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటుంది. శరీరంలోని ఏ భాగంలోనైనా సమస్య తలెత్తితే ఆ ప్రభావం శరీరంలోని మరో భాగంలో కనిపిస్తాయి. ఒకవేళ మీ నోటి ఆరోగ్యం క్షీణించినట్లయితే అది ప్రమాదకరమైన సమస్యకు లక్షణంగా చెప్పవచ్చు. మరి నోరు పొడిబారడం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మధుమేహం, స్ట్రోక్, హెచ్ ఐవి అల్జీమర్స్, సిండ్రోమ్ అలాగే నరాలు దెబ్బతినడం. ఇవన్నీ నోరు పొడిభారడం వల్ల వచ్చే వ్యాదులు. లాలాజలం ఉత్పత్తిలో తక్కువ, అలాగే నోరు పొడిబారడం సమస్యను జిరోస్టోమియా అని పిలుస్తారు. ఈ పరిస్థితిలో లాలాజలాన్ని ఉత్పత్తి చేసే గ్రంధులు అవసరమైన మొత్తంలో లాలాజలాన్ని ఉత్పత్తి చేయవు.

నోటి ఆరోగ్యానికి అవసరమైనంత లాలాజలం ఉత్పత్తి కానప్పుడు నోరు పొడిగా మారుతుంది. ఇకపోతే నోరు పొడిబారడం యొక్క సాధారణ లక్షణాల విషయానికి వస్తే.. నోటి లోపల జిగటగా అనిపించడం, శ్వాస నుంచి వాసన రావడం, మాట్లాడటంలో ఇబ్బంది కలగడం, నమలడం, వేగంగా మింగడం, గొంతులో ఏదైనా ఇరుక్కుపోవడం, నాలుక పొడిగా ఉండడం, తిన్నప్పుడు రుచిలో తేడా కనిపించడం లాంటివి లక్షణాలుగా చెప్పుకోవచ్చు. అయిత్వ పైన చెప్పిన లక్షణాలన్నీ కనిపించినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించడం ఎంతో మంచిది. నిర్లక్ష్యం చేయడం వల్ల అవి క్రమంగా మీ ప్రాణాలకు ప్రమాదం కావచ్చు. ఇందుకోసం నోటి పరిశుబ్రత కూడా ఎంతో ముఖ్యం.