Dry Eyes: కళ్ళు పొడిబారుతున్నాయా? ఆ వ్యాధి కావచ్చు!

కళ్ళు పొడిబారే ప్రాబ్లమ్ తో కొంతమంది బాధపడుతుంటారు..

కళ్ళు పొడిబారే (Dry Eyes) ప్రాబ్లమ్ తో కొంతమంది బాధపడుతుంటారు.. అయితే కళ్ళు పొడిబారే (Dry Eyes) ప్రాబ్లమ్ కు థైరాయిడ్ తో లింక్ ఉందని మీకు తెలుసా?  పొడి కళ్లు అనేవి థైరాయిడ్ రుగ్మతకు ఒక సంకేతం. ప్రత్యేకించి హైపర్ థైరాయిడిజం లక్షణాలలో ఇది ఒకటి. ఇందులో కళ్లు పొడిబారడంతో పాటు వాటిలో దురద, మంట కూడా కలుగుతుంది. కొందరిలో కళ్ళ చుట్టూ ఉండే కండరాలు, కణజాలం ఉబ్బుతాయి. కళ్లలోని తెల్లసొనలో ఎర్రబారడం, కంటి నొప్పి, ద్వంద్వ దృష్టి, కాంతి సున్నితత్వం వంటి సమస్యలు కూడా కలగొచ్చు. ఇవి ఎంతో అసౌకర్యంగా, బాధాకరంగా ఉంటాయి.

గ్రేవ్స్ చికిత్స తర్వాత..

కొంతమందిలో గ్రేవ్స్ (Graves’ disease) వ్యాధికి చికిత్స చేసిన తర్వాత హైపో థైరాయిడిజం అభివృద్ధి చెందితే గ్రేవ్స్ ఆప్తాల్మోపతి అని పిలవబడే కంటి సమస్య వస్తుంది.  గ్రేవ్స్ ఆప్తాల్మోపతి వల్ల కంటికి అసౌకర్యం కలుగుతుంది. పొడుచుకు వచ్చిన కనుబొమ్మలు , దృష్టి మార్పులకు ఇది కారణమవుతుంది.

హైపర్ థైరాయిడిజం ఎలా ప్రభావితం చేస్తుంది?

హైపర్ థైరాయిడిజం.. డ్రై ఐ సిండ్రోమ్.. ఇవి రెండూ వేర్వేరు సమస్యలు. డ్రై ఐ సిండ్రోమ్ లో మన కళ్ళు డ్రై గా తయార వుతాయి. కన్నీళ్లు ఎక్కువగా విడుదల కావు. విడుదల అయినా ఎక్కువ సేపు కళ్ళలో నిలువవు. హైపర్ థైరాయిడిజం ప్రాబ్లమ్ ఉన్న వాళ్లలో ఇందుకు పూర్తిగా డిఫరెంట్ గా జరగొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. హైపర్ థైరాయిడిజం ఉన్నవాళ్ళలో కళ్ళు పొడిబారే ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కొన్నిసార్లు సాధారణ స్థాయిలో , ఇంకొన్ని సార్లు పరిమితికి మించి కన్నీళ్లు ఉత్పత్తి చేసే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

కంటిపై థైరాయిడ్ ఎఫెక్ట్ ఎందుకు?

థైరాయిడ్ సంబంధిత కంటి సమస్య అనేది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. మన రోగనిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ సిస్టం) బయటి నుంచి శరీరంలోకి వచ్చే సూక్ష్మజీవులు, ఇతర కాలుష్య కారకాల నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. ఈక్రమంలో ఇది ఒక్కోసారి పొరపాట్లు చేస్తుంది. అలాంటి పొరపాట్ల వల్ల వచ్చే వ్యాధులే ఆటో ఇమ్యూన్ వ్యాధులు. మన ఇమ్యూనిటీ సిస్టం..మన కళ్ళు, వాటి చుట్టుపక్కల ఉండే శరీర కణజాలాలను బాహ్య ఆక్రమణదారుగా తప్పుపట్టి వాటిపై దాడి చేసినప్పుడు థైరాయిడ్ సంబంధిత కంటి సమస్య వస్తుంది.

థైరాయిడ్ గ్రంధిలోని ఆ హార్మోన్లు ఏం చేస్తాయంటే..

థైరాయిడ్ అనేది గొంతు మధ్యలో ఉండే గ్రంథి. ఇది చిన్న అవయవం అయినప్పటికీ, ఇది మన శరీరంలో అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. ఈ గ్రంథి మన శరీరంలో పెరుగుదల, కణాల మరమ్మత్తు మరియు జీవక్రియలను నియంత్రించడంలో సహాయపడే మూడు రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. మన శరీరంలోని థైరాయిడ్ గ్రంధి ఉత్పత్తి చేసే ప్రధాన హార్మోన్లలో ట్రైయోడో థైరోనిన్ (T3) మరియు థైరాక్సిన్ (T4) ఉన్నాయి. ఇవి టైరోసిన్ ఆధారిత హార్మోన్లు. ఇవి ప్రధానంగా  జీవక్రియ  నియంత్రణకు బాధ్యత వహిస్తాయి . T 3  మరియు T 4 హార్మోన్లు పాక్షికంగా అయోడిన్‌ తో కూడి ఉంటాయి .  అయోడిన్ లోపం వల్ల T 3 మరియు T 4 హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది.  థైరాయిడ్ కణజాలం పెరుగు తుంది. ఫలితంగా గాయిటర్ అనే వ్యాధి వస్తుంది.

హైపర్ థైరాయిడిజం అంటే..

హైపర్ థైరాయిడిజం అంటే అవసరానికి మించి థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి అయ్యే సమస్య. ఇలా జరిగినప్పుడు గుండె కొట్టుకునే వేగంలో మార్పులు వస్తాయి. ఫలితంగా గుండెకు సంబంధించిన సమస్యలు రావచ్చు. హైపో థైరాయిడిజాన్ని సరైన సమయంలో గుర్తించకపోతే ఒక్కోసారి బ్రెయిన్‌లో సమస్య తలెత్తడం, ఆపై సోడియం స్థాయి తగ్గిపోయి కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది.

హైపో థైరాయిడిజం అంటే..

హైపోథైరాయిడిజం అంటే  థైరాయిడ్ గ్రంథి తగినంత  థైరాయిడ్ హార్మోన్ ను ఉత్పత్తి చేయనప్పుడు వచ్చే వ్యాధి. ఈ వ్యాధి ప్రభావంతో చలిని తట్టుకోలేకపోవడం, నీరసం, మలబద్ధకం, హృదయ స్పందన రేటు తగ్గడం, నిరాశ, బరువు పెరగడం వంటి అనేక లక్షణాలు కలుగుతాయి. కొన్నిసార్లు థైరాయిడ్ గ్రంథివాపు వ్యాధి కారణంగా మెడ ముందుభాగంలో వాపు ఏర్పడుతుంది.

Also Read:  Twitter CEO: ట్విట్టర్​ సీఈఓగా మస్క్ పెంపుడు కుక్క