Site icon HashtagU Telugu

Beauty Tips: చర్మం కాంతివంతంగా మారాలి అంటే ఈ జ్యూస్ లను తాగాల్సిందే?

Mixcollage 24 Feb 2024 11 01 Pm 2552

Mixcollage 24 Feb 2024 11 01 Pm 2552

చాలామంది కాంతివంతమైన చర్మం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే రకరకాల బ్యూటీ ప్రోడక్ట్లను ఉపయోగించడంతో పాటు, హోమ్ రెమెడీలు వంటింటి చిట్కాలను కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయినా కూడా కొన్ని కొన్ని సార్లు మంచి ఫలితాలు కనిపించవు. మరి అలాంటప్పుడు ఏం చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో కొన్ని రకాల జ్యూస్ లు ఎంతో బాగా ఉపయోగపడతాయి అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ జ్యూస్ లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పుచ్చకాయ జ్యూస్ లో 90 శాతం నీరు ఉండే పుచ్చకాయ దాహాన్ని తీర్చడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

మరింత తేటగా మారుతుంది. అలాగే నిమ్మకాయ ఆరోగ్యానికి దివ్య ఔషధం. చర్మాన్ని శుభ్రపరచడంలో అత్యధిక సామర్థ్యం కలిగిన గుణాలు కలిగి ఉన్నది చర్మాన్ని శుభ్రపరచి ఫ్రెష్ గా ఉంచుతుంది. అదేవిధంగా ఆపిల్ జ్యూస్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. విటమిన్ సి అధిక మోతాదులో ఉంటుంది. ప్రతిరోజు ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మ సంబంధ వ్యాధుల్ని తగ్గిస్తుంది. అలాగే ఆపిల్ జ్యూస్లో కూడా ఇదే గుణాలు ఉంటాయి. కావున మృదుత్వాన్ని ఇచ్చి చర్మం మెరిసేలా చేస్తుంది. టమాటాల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ లు అధికంగా ఉంటాయి. టమాటాలను మిక్సీలో వేసుకుని జ్యూస్లా చేసుకుని దాంట్లో కొద్దిగా చక్కెర, ఉప్పు కలిపి తీసుకుంటే చర్మం మెరిసిపోతూ ఉంటుంది.

బొప్పాయి జ్యూస్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది రోజు ఒక అరకప్పు బొప్పాయి ముక్కలు తింటే చాలా మంచిది నిర్జీవమైన చర్మాన్ని కాంతవంతంగా మారుస్తుంది బొప్పాయి జ్యూస్ లో అరచి తేనె కలిపి ముఖానికి పట్టించాలి 20 నిమిషాల తర్వాత కడిగినట్లయితే చర్మం మెరిసిపోతూ ఉంటుంది. కాబట్టి పైన చెప్పిన ఐదు రకాల జ్యూస్ లు తాగితే చాలు మీ ఆరోగ్యంతో పాటు మీ చర్మం కూడా బాగుంటుంది.

Exit mobile version