‎Weight Loss: బరువు తగ్గడం కోసం వేడి నీటిని తాగుతున్నారా.. అయితే జాగ్రత్త!

‎Weight Loss: బరువు తగ్గడం కోసం వేడి నీటిని తాగేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవు అని చెబుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Weight Loss

Weight Loss

‎‎Weight Loss: అధిక బరువు సమస్యతో బాధపడేవారు బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే వేడి నీళ్లు తాగుతూ ఉంటారు. కొందరు ఎంత ఎక్కువ వేడి నీరు తీసుకుంటే అంత త్వరగా కొవ్వు తగ్గుతుందని భావిస్తారు.కానీ అది కేవలం అపోహ మాత్రమే. ఎందుకంటె ఎక్కువ వేడి నీరు తాగడం వల్ల కొవ్వు కరగడం సంగతి పక్కన పెడితే నోరు, గొంతు, పొట్ట లోపలి పొర దెబ్బతినవచ్చని చెబుతున్నారు.

‎‎ఉదయం లేవగానే ఏమీ తినకుండా బాగా వేడిగా ఉండే నీరు తాగడం వల్ల కడుపులో ఎక్కువ ఆమ్లం ఏర్పడుతుందట. దీనివల్ల వికారం, వాంతులు లేదా గ్యాస్ సమస్యలు రావచ్చని చెబుతున్నారు. అలాగే ‎భోజనం చేసిన వెంటనే వేడి నీరు తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇది శరీరంలోని జీర్ణ ఎంజైమ్‌లపై ప్రభావం చూపుతుందట. దీనివల్ల ఆహారం కూడా సరిగ్గా జీర్ణం కాదని చెబుతున్నారు.

‎ బరువు తగ్గడం కోసం చాలామంది చల్లని ఇంటికి బదులుగా గంట గంటకు వేడి నీరు తాగడం వల్ల మీ కిడ్నీలపై ఒత్తిడి పెరిగి శరీరంలోని ముఖ్యమైన ఖనిజాలు బయటకు వెళ్లిపోవచ్చట. దీనివల్ల శరీరంలో బలహీనత, అలసట కూడా కలుగుతుందని చెబుతున్నారు. మరిగే నీటిని తాగితే నోటిలోని పొరలు కాలిపోతాయట. ఇది లాలాజలం సహజ సమతుల్యతను దెబ్బతీస్తుందని, దీర్ఘకాలికంగా ఇలా చేయడం వల్ల గొంతు సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. అలాగే ఎక్కువ వేడి ఉన్న నీరు తాగినా కూడా గొంతు పగిలి తినడానికి కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెబుతున్నారు. ఒకవేళ మీరు కూడా బరువు తగ్గడం కోసం వేడి నీటిని తాగాలి అనుకుంటే వైద్యులు సలహా తీసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు..

  Last Updated: 04 Oct 2025, 05:30 PM IST