Kidney Stones: బీర్ తాగితే కిడ్నీ స్టోన్స్ తగ్గుతాయంట..!

మూత్రపిండాల్లో రాళ్లు (కిడ్నీ స్టోన్స్) ఏర్పడే సమస్య భారత్ దేశంలో ఎక్కువగా పెరుగుతోంది. కిడ్నీల పనితీరు, రిస్క్ గురించి చాలా మందికి అవగాహన ఉండట్లేదు

Published By: HashtagU Telugu Desk
Drinking Beer Reduces Kidney Stones..!

Drinking Beer Reduces Kidney Stones..!

మూత్రపిండాల్లో రాళ్లు (Kidney Stones) ఏర్పడే సమస్య భారత్ దేశంలో ఎక్కువగా పెరుగుతోంది. కిడ్నీల పనితీరు, రిస్క్ గురించి చాలా మందికి అవగాహన ఉండట్లేదు .. కిడ్నీ స్టోన్స్ సమస్య పెరగడానికి ఇది కూడా ఒక కారణం. ప్రపంచ కిడ్నీ దినోత్సవం (మార్చి 9) సందర్భంగా ఆన్ లైన్ హెల్త్ కేర్ సేవల సంస్థ ప్రిస్టీన్ ఓ సర్వే నిర్వహించింది. ఆశ్చర్యం ఏమిటంటే.. సర్వేలో అభిప్రాయాలు తెలియజేసిన వారిలో ప్రతి ముగ్గురికి గాను ఒకరు.. బీర్ తాగితే కిడ్నీ స్టోన్స్ తగ్గిపోతాయని చెప్పారు. ఆ సర్వేలో 1000 మంది వరకు పాల్గొన్నట్టు సంస్థ తెలిపింది .

కిడ్నీ స్టోన్స్ (Kidney Stones) చికిత్సను ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు జాప్యం చేసినట్టు 50 శాతం మంది చెప్పారు. మన దేశంలో కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయనడానికి నిదర్శనంగా 2021తో పోలిస్తే 2022లో కిడ్నీ సమస్యల కోసం తీసుకునే ఆన్ లైన్ అపాయింట్ మెంట్లు 180 శాతం పెరిగాయి. వీటిల్లో ఎక్కువ కన్సల్టేషన్లు కిడ్నీ స్టోన్ల కోసమే. మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఈ సమస్య ౩ రెట్లు ఎక్కువ.. కిడ్నీస్టోన్స్ కు మధుమేహం, డయాబెటిస్ ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. ఈ విషయంపై 14 శాతం మందికే అవగాహన ఉంది. మూత్రపిండాలు మూత్రాన్ని తయారు చేస్తాయని సగం మందికి తెలియకపోవడం ఆశ్చర్యం. కిడ్నీలు ప్రొటీన్లను విచ్ఛిన్నం చేస్తాయని తెలిసిన వారు 9 శాతం మందే. ప్రొటీన్ సప్లిమెంట్లతో కిడ్నీ స్టోన్స్ వస్తాయని సగానికి పైగా సర్వేలో చెప్పారు. సర్వే ఫలితాలు కిడ్నీ ఆరోగ్యం పట్ల సరైన అవగాహన లేదని తెలియజేస్తున్నట్టు ప్రిస్టీన్ కేర్ పేర్కొంది.

Also Read:  Firefly: డైనోసార్ల టైం కు చెందిన భారీ తుమ్మెద.. వాల్ మార్ట్ స్టోర్ లో గుర్తింపు

  Last Updated: 10 Mar 2023, 02:34 PM IST