Site icon HashtagU Telugu

Tulsi Tea Benefits: తులసి టీ తాగితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్.. తెలుసుకుంటే ఇక తాగకుండా ఆగలేరు!!

Tulsi Tea 500x500

Tulsi Tea 500x500

తులసి మొక్క ఎంతో శుభప్రదమైంది మాత్రమే కాదు.. ఆరోగ్యప్రదాయిని కూడా!! తులసి ఆకులలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అడాప్టోజెనిక్, యాంటీ ఆర్థరైటిక్, యాంటీ డయాబెటిక్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు తులసి ఆకుల్లో ఉన్నాయి.తులసి ఆకులతో తయారుచేసిన టీ తాగితే ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

తయారీ ఇలా..

తులసి టీ తయారీ కోసం 6-7 తాజా తులసి ఆకులు, 1 అల్లం ముక్క, 2 టీస్పూన్ల తేనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 2 పచ్చి ఏలకులు, 2 1/2 కప్పుల నీరు తీసుకోవాలి. ముందుగా నీటిని మరిగించాలి. ఆ తరువాత ఆకులతో సహా అన్నింటినీ మరిగే నీటిలో యాడ్ చేయాలి. 2-3 నిమిషాలు పాటు వీటిని మరిగించాలి. ఆపై స్టవ్ కట్టేసి తులసి టీని తాగొచ్చు. అయితే అధిక రక్తస్రావం, విపరీతమైన ఆకలి, నొప్పితో బాధపడేవారు తులసి టీ తాగాక పోవడమే శ్రేయస్కరమని అంటారు.

ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ..

* ఈ ఔషధ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ , యాంటీ-కార్సినోజెనిక్ లక్షణాలు వివిధ రకాల క్యాన్సర్లు రాకుండా నివారిస్తాయి. గుండె జబ్బులను కూడా దూరం చేస్తాయి.

* తులసి టీ ఒక యాంటీ-స్ట్రెస్ డ్రెస్ లాగా పనిచేస్తుంది. డైలీ ఈ టీ తాగడం ద్వారా డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు.

* ఇందులో లభించే పొటాషియం అనేది మెదడులోని సెరోటినిన్ లెవల్స్ పెంచుతుంది. తద్వారా ఒత్తిడి లక్షణాలు తగ్గుతాయి.

* ఈ టీ సువాసన కూడా మనసుకు చాలా ప్రశాంతతను అందిస్తుంది.

* ఇందులోని యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఫంగల్ చర్మ వ్యాధులు తగ్గిస్తాయి.

* ఈ టీలోని ఒక పదార్థం దంతాలు పుచ్చిపోకుండా కాపాడుతుంది. పాచి కలిగించే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. నోటి దుర్వాసనను దూరం చేస్తుంది.

* యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అంటువ్యాధుల రుగ్మతలు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

* డైలీ ఒక కప్పు తులసి టీ తాగడం ద్వారా శ్వాసకోశ రుగ్మతలు తొలగిపోతాయి. అలాగే ఇందులో ఉన్న యాంటీవైరల్ లక్షణాలు దగ్గు, జలుబు, వైరల్ జ్వరం తగ్గేందుకు బాగా సహాయపడుతాయి.

* సైనసైటిస్, తలనొప్పిని వంటి సమస్యలను కూడా తులసి టీ తగ్గిస్తుంది.

* రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.

* నిద్రలేమి అనేక అనారోగ్యాలకు దారి తీస్తుంది. తులసి టీ నిద్రలేమికి శక్తివంతమైన ఔషధంగా పనిచేస్తుంది.

* తులసి టీ తీసుకోవడం వల్ల విసర్జన ప్రక్రియ సులభతరం కావడమే కాకుండా గ్యాస్ సమస్య, విరేచనాలు, కడుపులో తిమ్మిర్లు, మలబద్ధకం వంటిసమస్యల నుంచి బయటపడవచ్చు.