Winter Tips: చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి జ్యూస్ లు తీసుకోవాలో మీకు తెలుసా?

‎Winter Tips: చలికాలంలో ఇప్పుడు చెప్పబోయే కొన్ని రకాల జ్యూస్లు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేడే జరుగుతుంది అని చెబుతున్నారు వైద్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Published By: HashtagU Telugu Desk
Winter Tips

Winter Tips

Winter Tips: ‎శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి ఈ వాతావరణం కి ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. శరీరం వేడిగా వెచ్చగా లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాగా శీతాకాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే శీతాకాలంలో అనారోగ్యానికి గురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కాలంలో ఆహారంపై అధిక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం అని చెబుతున్నారు.

‎ శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో దానిమ్మ రసం తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ రసం తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు నయం అవుతాయట. ఖాళీ కడుపుతో దానిమ్మ రసం తాగితే మీ రోగనిరోధక శక్తి బలపడుతుందని, మీకు ఏవైనా జీర్ణ సమస్యలు ఉంటే, అవి కూడా పరిష్కరించబడతాయని చెబుతున్నారు. దానిమ్మ జ్యూస్‌లోని విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి, ఇది చలికాలంలో సాధారణంగా వచ్చే జలుబు మరియు దగ్గు వంటి ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది.

ఒకవేళ మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే దానిమ్మ జ్యూస్‌ తాగడం మంచిదట. ఎందుకంటే దానిమ్మ రసం బరువు తగ్గడానికి ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. కాగా దానిమ్మ జ్యూస్‌ ఆరోగ్యానికి మంచిది. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ జ్యూస్‌ తాగకుండా ఉండాలి. బీపీ, డయాబెటిస్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు దానిమ్మ జ్యూస్‌ తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది జలుబు, దగ్గు వంటి సాధారణ శీతాకాలపు వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

  Last Updated: 05 Dec 2025, 06:26 AM IST