Site icon HashtagU Telugu

Drifruits Kajjikayalu: పిల్లలు ఎంతగానో ఇష్టపడే డ్రైఫ్రూట్స్ కజ్జికాయలు ఇలా చేస్తే చాలు ఒక్కడు కూడా మిగలదు?

Mixcollage 31 Jan 2024 05 23 Pm 1922

Mixcollage 31 Jan 2024 05 23 Pm 1922

మామూలుగా రెండు తెలుగు రాష్ట్రాలతో ఇతర కొన్ని రాష్ట్రాలలో కూడా పండుగలు పెళ్లిళ్లు పేరంటాల సమయంలో కజ్జికాయలు, అట్లు చక్కిలాలు వంటివి తయారు చేస్తూ ఉంటారు. వీటిని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా కజ్జికాయలు అనేక రకాల కజ్జికాయలు ఉన్నాయి. కొందరు బెల్లం పప్పుల పొడి వేసి కజ్జికాయలు చేస్తే మరికొందరు పప్పుల పొడి చక్కర వేసి తయారు చేస్తూ ఉంటారు. కొందరు ఎండు కొబ్బరితో కూడా కజ్జికాయలు తయారు చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు తిన్నారా. ఎప్పుడు తినకపోతే ఈ రెసిపీ ని సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఈ రెసిపీ కి కావాల్సిన పదార్థాలు ఏమిటి? దానిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

డ్రైఫ్రూట్స్‌ కజ్జికాయలకు కావాల్సిన పదార్థాలు :

గోధుమపిండి
నీరు
ఉప్పు
నెయ్యి
పంచదార
యాలకుల
డ్రైఫ్రూట్స్‌
నూనె

డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు తయారీ విధానం:

కజ్జికాయలను చేసేటప్పుడు ముందుగా గోధుమపిండి లో తగినంత నీరు, ఉప్పు, నెయ్యి వేసి మెత్తని ముద్దగా తయారుచేసి పక్కన ఉంచాలి. ఒక పాత్రలో పంచదార, యాలకుల, డ్రైఫ్రూట్స్‌ పొడులు వేసి బాగా కలపాలి. ఇప్పుడు గోధుమ పిండిని పూరీలుగా చేసుకుని మధ్యలో కొంత డ్రైఫ్రూట్‌ మిశ్రమం పెట్టి సగానికి మడిచి అంచుల్ని ఒత్తుకోవాలి. అన్నీ తయారయ్యాక నూనెలో దోరగా వేగించి, చల్లారిన తర్వాత డబ్బాలో భద్రపరచుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు రెడీ..