Dragon Milkshake : డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ మిల్క్ షేక్.. ఇంట్లోనే ఇలా చేసుకుంటే సూపర్

డ్రాగన్ ఫ్రూట్ ను కట్ చేసుకుని, వలుచుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక దానిమ్మను కట్ చేసి గింజల్ని వలుచుకోవాలి. 1 కప్పు డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు, అరకప్పు దానిమ్మ గింజలు, 60 ఎంఎల్ ఐస్ క్రీమ్ లేదంటే ఫ్రెష్ క్రీమ్, కొద్దిగా పాలమీగడ, చల్లనిపాలు, ఐస్ క్యూబ్స్ జ్యూస్ జార్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి.

  • Written By:
  • Publish Date - June 30, 2024 / 08:26 PM IST

Dragon Fruit Pomegranate Milk Shake : సీజన్ ఏదైనా.. ఐస్ క్రీములకు, మిల్క్ షేక్ లకు స్పెషల్ లవర్స్ ఉంటారు. వారికి సమ్మర్ తో పనిలేదు. గడ్డకట్టే చలిలోనూ ఐస్ క్రీమ్ తింటారు. జోరువానలోనూ మిల్క్ షేక్ తాగుతారు. అయితే ఇలా తరచూ చేస్తే ఆరోగ్యాన్ని కాస్త రిస్క్ లో పెట్టినట్టే కానీ.. ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటే తాగితే ఏమీకాదు. అయితే.. బయట దొరికే మిల్క్ షేక్స్ కాకుండా ఇంటిలోనే మిల్క్ షేక్ తయారు చేసుకుని తాగితే.. ఆ కిక్కే వేరు కదా. ఈరోజు డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ గింజలతో మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం.

డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ మిల్క్ షేక్ తయారీకి కావలసిన పదార్థాలు

డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు – 1 కప్పు

దానిమ్మ గింజలు – 1/2 కప్పు

పంచదార – 3 టేబుల్ స్పూన్లు

ఫ్రెష్ క్రీమ్ లేదా ఐస్ క్రీమ్ – 60 ML

పాలమీగడ – కొద్దిగా

చల్లటి పాలు – 1 కప్పు

ఐస్ క్యూబ్స్ – 1/4 కప్పు

ఐస్ క్రీమ్ – 1 స్కూప్

డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ మిల్క్ షేక్ తయారీ విధానం

ముందుగా డ్రాగన్ ఫ్రూట్ ను కట్ చేసుకుని, వలుచుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక దానిమ్మను కట్ చేసి గింజల్ని వలుచుకోవాలి. 1 కప్పు డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు, అరకప్పు దానిమ్మ గింజలు, 60 ఎంఎల్ ఐస్ క్రీమ్ లేదంటే ఫ్రెష్ క్రీమ్, కొద్దిగా పాలమీగడ, చల్లనిపాలు, ఐస్ క్యూబ్స్ జ్యూస్ జార్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసులో పోసుకుని.. ఒక స్కూప్ ఐస్ క్రీమ్ తో గార్నిష్ చేసుకోవాలి. అంతే సింపుల్. చల్ల చల్లని మిల్క్ షేక్ రెడీ.

Also Read : Heavy Bleeding : పీరియడ్స్ సమయంలో రక్తస్రావం అధికంగా ఉంటోందా ? ఈ చిట్కాలతో కంట్రోల్ చేయండి