Dosakaya Mulakkada Curry: ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ ములక్కాడ కూర.. తయారు చేసుకోండిలా?

మామూలుగా మనం దోసకాయతో ఎన్నో రకాల వంటకాలు తయారు చేసుకుని తినే ఉంటాం. అలాగే ములక్కాడతో కూడా రకరకాల రెసిపీలను తినే ఉంటాం. అయితే ఎప్పు

Published By: HashtagU Telugu Desk
Mixcollage 07 Dec 2023 08 29 Pm 154

Mixcollage 07 Dec 2023 08 29 Pm 154

మామూలుగా మనం దోసకాయతో ఎన్నో రకాల వంటకాలు తయారు చేసుకుని తినే ఉంటాం. అలాగే ములక్కాడతో కూడా రకరకాల రెసిపీలను తినే ఉంటాం. అయితే ఎప్పుడైనా ములక్కాడ దోసకాయ కలిపి తయారుచేసిన కూరని ఎప్పుడైనా తిన్నారా. ఎప్పుడు ట్రై చేయకపోతే, దోసకాయ ములక్కాడ కూర ఎలా తయారు చేసుకోవాలి? అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

దోసకాయ ములక్కాడ కూరకు కావలసిన పదార్ధాలు:

దోసకాయ పెద్దది – 1
ములక్కాడ ముక్కలు – 6
ఉల్లిపాయ – 1
వెల్లుల్లి – 4 రెబ్బలు
పచ్చి మిర్చి – 1
టమాటా – 1
మెంతికూర – 1 కట్ట
జీలకర్ర – 1/2 చెంచా
ఆవాలు – 1/4 చెంచా
పసుపు – చిటికెడు
ఉప్పు – 1/2 చెంచా
కారం – కొద్దిగా
కరివేపాకు – తగినంత
కొత్తిమీర – తగినంత

దోసకాయ ములక్కాడ కూర తయారీ విధానం:​

ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టి నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి, ఆవాలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు వేసి వేయిస్తూ ఉల్లి ముక్కలు వెయ్యాలి. అవి కాస్త వేగాక టమాటా ముక్కలు వేసి వేయించి ముక్కలుగా తరిగిన దోస ముక్కలు, ముల క్కాడలు వేసి ఉప్పు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. దోసముక్కలు మంచి వాసన వస్తున్నప్పుడు కొద్దిగా నీరుపోసి ములక్కాడ ముక్కలు ఉడికించుకోవాలి. అప్పుడు పులుసు కావాలంటే చింతపండు రసంతో ఉడికించుకోవాలి. ఈ కూర త్వరగా ఉడుకుతుంది ౩ వంతుల భాగం ఉడికాక మెంతి ఆకులు పైన వేసి మూతపెట్టి కారం పొడి వేసి పొయ్యి మీద నుండి దింప్తేస్తే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ ములక్కాడ కూర రెడీ.

  Last Updated: 07 Dec 2023, 08:30 PM IST