Site icon HashtagU Telugu

Geyser : గీజర్ ఆన్ చేసి స్నానం చేస్తున్నారా ? ఈ విషయాలు తెలిస్తే ఇకపై అలా చేయరు..

geyser tips

geyser tips

Geyser : మనిషి జీవితంలో ఎక్కువ కష్టపడకుండా.. కావలసిన అవసరాలన్నీ సింపుల్ గా పూర్తయ్యేలా.. చాలా రకాల మెషీన్లు వచ్చాయి. కట్టెల పొయ్యి నుంచి గ్యాస్ వరకూ, ఎడ్లబండి నుంచి ఈ-బైక్స్, కార్లు వరకూ, వాషింగ్ మెషీన్లు, మైక్రో ఓవెన్లు.. ఇలా ఒక్కటేంటి.. ప్రతిదానికి కరెంట్ తో పనిచేసే వస్తువులపైనే ఆధారపడిపోయాం. ఆఖరికి స్నానం చేయడానికి కావలసిన వేడినీరు కూడా ఒక్క స్విచ్ ఆన్ చేస్తే చాలు.. రెడీ అవుతాయి. ఇక్కడే అసలు పొరపాటు చేస్తున్నారు. గీజర్ బటన్ ను ఆన్ చేసి స్నానం చేస్తే.. చాలా నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది.

స్నానం చేస్తుండగా.. గీజర్ ను ఆన్ లో ఉంచితే.. అది వేడెక్కుతుంది. పగిలిపోయేలా చేస్తుంది. దానిలోని బాయిలర్ పై ఒత్తిడి పడటంతో.. గీజర్ లో లీకేజీ సమస్యలను కలిగిస్తుంది. దానివల్ల వైర్ ద్వారా కరెంట్ ప్రవహిస్తుంది. ఇది మీ మరణానికి కూడా కారణం అవ్వొచ్చు. మీ గీజర్ లోపలుండే వైర్ రాగితో చేసింది కాకపోయినా అది పేలే ప్రమాదం ఉంది.

ఇప్పుడు మార్కెట్లో లభించే గీజర్లన్నింటిలోనూ ఆటోమేటిక్ హీట్ సెన్సార్ ఉంటుంది. అలాంటపుడు గీజర్ ఆన్ చేసి స్నానం చేస్తే ప్రమాదం లేదనుకుంటే తప్పు. బాయిలర్ హీట్ అయినపుడు ఆటోమేటిక్ సెన్సార్లు కూడా పనిచేయడం మానేసే ప్రమాదం లేకపోలేదు. లోపలుండే కాయిల్ వేడిగా ఉంటే.. షార్ట్ సర్క్యూట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. గీజర్ లోపల ఎలక్ట్రిక్ కేబుల్స్ ను సరిగా అమర్చకపోయినా.. స్నానం చేసేటపుడు షాక్ కొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి అనుభవజ్ఞుడైన ఎలక్ట్రీషియన్ ద్వారా మాత్రమే గీజర్ ను ఇన్ స్టాల్ చేసి.. రిపేర్ చేయించాలి.

అలాగే.. గీజర్ ను చీకటి ప్రదేశంలో కాకుండా.. వెంటిలేషన్ జరిగే ప్రదేశంలో ఉంచాలి. స్నానం చేసేటపుడు గీజర్ ను ఆన్ లో ఉంచకూడదు. గీజర్ లోపల నీటిస్థాయి 1/3 వంతు ఉండాలి. గీజర్ ను పదే పదే ఆన్, ఆఫ్ చేయకూడదు. స్నానానికి ముందే గీజర్ ను ఆన్ చేసి.. స్నానం చేసేటపుడు ఆఫ్ చేయాలి. అలాగే గీజర్ సమీపంలో ఎలాంటి మంటలు లేకుండా చూసుకోవాలి. రానున్నది వేసవికాలం కాబట్టి.. వేసవిలో గీజర్ ఉష్ణోగ్రత 50-55 డిగ్రీల మధ్య ఉండేలా చూసుకోవాలి.