Old Mobiles : కొత్త ఫోన్ ఉండగా..పాత ఫోనెందుకు దండగ అనుకుంటున్నారా.. ఇలా వాడుకోండి

కీ ప్యాడ్ ఉన్న మొబైల్స్ నుంచి స్మార్ట్ మొబైల్స్ కు అప్ గ్రేడ్ అవ్వగానే.. ఇక వాటితో ఏం పని అని ఓ మూలన పడేసుంటారు కదూ. ఇంకొన్నాళ్లకు అవి ఎందుకూ పనికిరావని బయట పారేస్తారు.

  • Written By:
  • Publish Date - October 20, 2023 / 08:24 PM IST

Old Mobiles : మనదగ్గర ఎంత మంచి మొబైల్ ఉన్నా.. మార్కెట్లోకి కొత్తమోడల్ వస్తే.. మనసంతా దానిపైనే ఉంటుంది. ఆ ఫోన్ ఎప్పుడెప్పుడు కొనుక్కుందామా అని ఎదురుచూస్తుంటాం. ఇలా కొందరికి మొబైల్స్ మార్చడం అంటే.. బట్టలు మార్చుకున్నంత ఈజీ. ఆ ఫోన్ ఖరీదెంతైనా సరే.. ముందు కొనేయాలంతే. కొత్తది కొంటారు సరే. మరి పాత ఫోన్ ని ఏం చేశారు?

కీ ప్యాడ్ ఉన్న మొబైల్స్ నుంచి స్మార్ట్ మొబైల్స్ కు అప్ గ్రేడ్ అవ్వగానే.. ఇక వాటితో ఏం పని అని ఓ మూలన పడేసుంటారు కదూ. ఇంకొన్నాళ్లకు అవి ఎందుకూ పనికిరావని బయట పారేస్తారు. ఇలా చేయడం వల్ల భూమిపై ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పెరిగి.. తిరిగి అది మనకే హాని కలిగిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే ఆ పాత మొబైల్ ని ఏం చేయాలి? ఎలా వాడుకోవాలి అనే కదా మీ డౌట్. పాత మొబైల్స్ ను రీ సైక్లింగ్ కోసం బాగా వాడుతున్నారు. అది ఎలాగో, వాటితో ఏమేం చేస్తారో చూద్దాం.

1. పోర్టబుల్ డ్రైవ్ : పాత మొబైల్ ను రీ సైకిల్ చేసేందుకు ఉన్న మార్గాల్లో.. నిల్వపరికరంగా ఉపయోగించడం ఒకటి. మీ ఫొటోలు, వీడియోలు, ఫైల్స్, ఇతర డేటాను పాత ఫోన్ కు ట్రాన్స్ఫర్ చేసుకుని.. దానిని పోర్టబుల్ డ్రైవ్ గా ఉపయోగించుకోవచ్చు.

2.కార్ కెమెరా : మీ ఓల్డ్ మొబైల్ కి ఉన్న కెమెరా ఇప్పటికీ పనిచేస్తుంటే..దానిని డాష్ కెమెరాగా మార్చుకోవాలి. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి ఏదైనా డాష్ కెమెరా యాప్ ను డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. పాత ఫోన్ ను మౌంట్ చేసేందుకు కారులో ఫోన్ హోల్డర్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఈ ఫోన్ ను కారులో ఉంచి తే.. రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో వీడియో రికార్డ్ చేసేందుకు ఉపయోగపడుతుంది.

3. రీ సైక్లింగ్ : ఒకవేళ మీ ఓల్డ్ మొబైల్ పనిచేయకపోతే దానిని చెత్తబుట్టలో వేయడానికి బదులుగా.. cashify.in, Recycledevice.in లేదా Namoewaste.com వంటి ఆన్ లైన్ వెబ్ సైట్ లలో రీసైక్లింగ్ కోసం పంపవచ్చు. అందుకు ప్రతిఫలంగా వాళ్లు డబ్బు, రివార్డులను చెల్లిస్తారు.

4.ఎక్స్ఛేంజ్ : అమెజాన్, ఫ్లిప్ కార్ట్, టాటా క్లిక్ లేదా.. ఏదేని ఇతర ఈ కామర్స్ ప్లాట్ ఫారమ్స్ లో కొత్త మొబైల్ కొనేటపుడు.. ఎక్స్ చేంజ్ లో మీ ఓల్డ్ మొబైల్ ను ఇవ్వొచ్చు. ఫలితంగా కొత్త మొబైల్ ధరలో కొంత తగ్గుతుంది. పండుగ ఆఫర్ల సమయంలో ఇలా చేయడం వల్ల తక్కువధరకే కొత్త మొబైల్ కొనుక్కోవచ్చు.

5.నావిగేషన్ : ఎంత కొత్త మొబైల్ అయినా.. అదే పనిగా వాడితే ఛార్జింగ్ అయిపోతుంది. అందుకే కొన్ని పనులకు పాత ఫోన్లకు కూడా వాడుకోండి. ఉదాహరణకు నావిగేషన్ కోసం ఓల్డ్ మొబైల్ ను వాడుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్, యాపిల్ మ్యాప్స్ లో నావిగేషన్ కోసం బాగా యూజ్ అవుతాయి.

6. రీ సేల్ లేదా డొనేషన్ :  పాత ఫోన్ తో మీకింక అవసరం లేదనిపిస్తే దానిని చెత్తబుట్టలో వేసేకంటే రీ సేల్ చేసుకోవచ్చు.అందులో ఏదొక పార్ట్ రీ సైక్లింగ్ కు పనికొస్తుంది. అలాగే ఫోన్ అవసరం ఉండి.. కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి పాత మొబైల్ ను విరాళంగా ఇస్తే.. వారికి చాలా సహాయం చేసినవారవుతారు.